CM Revanth Reddy : ఇలాంటి సీఎంని ఇంత వ‌ర‌కు చూడ‌లేదు.. రేవంత్‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు..

CM Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు ప్రమాణం చేశారు. అయితే సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన‌ప్ప‌టి నుండి రేవంత్ రెడ్డి దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాడు. ప్ర‌మాణ స్వీకారం రోజు ప్రగతి భవన్ ఇనుప కంచెలు బద్దలు కొట్టామని.. శుక్రవారం ఉదయం 10 గంటలకు అక్కడ ప్రజా దర్బార్ నిర్వహిస్తామని చెప్పారు. ప్రగతి భవన్ పేరుని జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌గా మారుస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై ప్రజా భవన్‌కు ఎవరైనా రావొచ్చు అని.. ఎలాంటి ఆంక్షలు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

సీఎం ప్రకటనతో తమ సమస్యలను చెప్పుకోడానికి ప్రగతి భవన్‌కు ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను సీఎం స్వీకరించారు. ప్రజా దర్బారులో వచ్చిన ప్రతీ ఫిర్యాదును పరిష్కరించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. 20 మంది సిబ్బందిని నియమించారు. వినతులను సంబంధిత జిల్లా కలెక్టర్లు, శాఖలకు సీఎం సిఫార్సు చేసారు. ప్రజా దర్బారులో వచ్చిన ఫిర్యాదులను ప్రతి నెల సమీక్షించనున్నారు. తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలతోనే కాదని, ప్రపంచంతోనే పోటీపడేలా చేస్తానన్నారు. కాగా ప్రజా దర్బార్ ప్రతి శుక్రవారం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ప్రజా దర్బార్ ద్వారా ప్రజల ఫిర్యాదులను స్వీకరించి వెంటనే పరిష్కరించేలా సీఎం రేవంత్ చర్యలు చేపట్టనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.

telangana people praising CM Revanth Reddy for his schemes
CM Revanth Reddy

అయితే రేవంత్ జోరు చూసి ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇలాంటి సీఎంని ఇంత వ‌ర‌కు చూడ‌లేద‌ని, ప్ర‌జ‌ల కోసం ప‌ని చేస్తున్నార‌ని అన్నారు. కంచె తీసేయడం వ‌ల‌న ఇప్పుడు ప్ర‌జ‌ల‌కి క‌ష్టాలు త‌ప్పాయ‌ని చెబుతున్నారు. ఇక ఇదిలా ఉంటే గాంధీభవన్‌లో నిర్వహించిన సోనియా గాంధీ పుట్టిన రోజు వేడుకల్లో సీఎం రేవంత్, మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… కార్యకర్తల వల్లే తాము సీట్లలో కూర్చున్నామన్నారు. ఎన్ని రాజకీయ ప్రకంపనలు ఎదురైనా ఉక్కు సంకల్పంతో సోనియా తెలంగాణ ఇచ్చారన్నారు. తెలంగాణ తల్లి ఎలా ఉంటుందో చూడలేదని.. తెలంగాణ తల్లి సోనియా లాగే ఉంటుందని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని సీఎం తెలిపారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

9 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

9 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago