Vallabhaneni Vamsi : కాల్చ‌మంటావా.. పూడ్చ‌మంటావా.. క్లారిటీగా చెప్పు.. వ‌ల్ల‌భ‌నేని వంశీ..

Vallabhaneni Vamsi : వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరగనున్న నేప‌థ్యంలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం తెగ వేడెక్కింది. టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు ఖరారయ్యేట్టు క‌నిపిస్తుండ‌గా, వైసీపీ మాత్రం సోలో ఫైట్ చేసే ఆలోచ‌న‌లో ఉంది. అయితే ఇన్నాళ్లు బీజేపీని ఒక్క మాట కూడా అనని వైసీపీ నేతలు ఒక్కసారిగా బీజేపీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా వల్లభనేని వంశీ ఈ పొత్తులపై మాట్లాడుతూ… సినిమాల్లో విలన్లు ఎంతో మంది ఉంటారని, హీరో మాత్రం ఒక్కడే ఉంటాడని.. ముఖ్యమంత్రి జగన్ కూడా అంతేనని చెప్పారు. జగన్ ఒంటరిగానే యుద్ధం చేస్తారని చెప్పుకొచ్చారు.

గన్నవరంలోని పానకాల చెరువును రిజర్వాయర్‌గా చేసే పనులకు.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ శంకుస్థాపన చేశారు. పానకాల చెరువు రిజర్వాయర్‌గా మారితే.. గన్నవరం ప్రజలకు మంచినీటి సమస్య తీరుతుందని ఆయ‌న వివరించారు. చెరువులో పూడిక తీసిన మట్టిని గన్నవరం నియోజకవర్గంలోని జగనన్న లేఔట్‌లకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలియ‌జేశారు. అదే స‌మ‌యంలో మీడియాతో మాట్లాడుతూ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. కాటికి కాలు చాపిన వాడికే స్మశానం గుర్తుకొస్తుంది. చంద్రబాబు కాటికి కాలు చాపాడు కాబట్టే.. పేదలకు ఇస్తున్న సెంటు స్థలంను సమాధులతో పోల్చాడు.

Vallabhaneni Vamsi comments on chandra babu
Vallabhaneni Vamsi

ఊరు పొమ్మంటుంది.. కాడు రమ్మంటుంది అనే స్థితిలో చంద్రబాబు ఉన్నారు. గన్నవరం నియోజకవర్గంలో 27 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే.. ఎక్కువ శాతం ఇళ్లు నిర్మించుకొని గృహ ప్రవేశం కూడా చేశారు. అద్దె ఇంట్లో ఉంటూ అనేక ఇబ్బందులు పడుతున్న 30 లక్షల మంది పేదలకు.. జగన్ ఆత్మగౌరవాన్ని ఇచ్చారు’ అని వల్లభనేని వంశీ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు.. అంతకుముందు మంత్రి అంబటి రాంబాబు సైతం చంద్రబాబుపై మండిపడ్డారు. పోలవరం పనుల పురోగతిపై ఈనాడు దుష్ప్రచారం చేస్తోందన్నారు. పోలవరం పురోగతి ఆగిపోయిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం నిర్మాణంలో చంద్రబాబు అనేక తప్పిదాలు చేశారని మంత్రి ఆరోపించారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

9 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

9 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago