Venu Swamy : ఉద‌య్ కిర‌ణ్‌లాగే విజ‌య్ దేవ‌ర‌కొండ జాత‌కం.. వేణు స్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

Venu Swamy : స‌మంత – నాగ చైత‌న్య విడాకుల విష‌యం గురించి ముందుగానే చెప్పి అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించిన ప్ర‌ముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి. ఈయ‌న సినిమా ప్ర‌ముఖులు, రాజ‌కీయ‌ల నాయ‌కుల జాత‌కాల గురించి త‌ర‌చూ మాట్లాడుతుంటారు. ఇప్ప‌టివ‌ర‌కు చాలా మందిపై కామెంట్స్ చేసిన వేణు స్వామి అందులో ఏదో ఒక కాంట్ర‌వ‌ర్సీ ఉండేలా చూసుకుంటాడు. అయితే ఆ మ‌ధ్య విజ‌య్ దేవ‌ర‌కొండ గురించి వేణు స్వామి కొన్ని సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. విజయ్ దేవరకొండను తెలంగాణ మెగాస్టార్ అని యాంకర్ అభివర్ణించగా విజయ్ దేవరకొండకు అంత సీన్ లేదని వేణు స్వామి గాలి తీసేశారు.

విజయ్ దేవరకొండది మరో ఉదయ్ కిరణ్ లాంటి జాతకం అని, ఆయ‌న‌కు అనుకోకుండా కొన్ని హిట్స్ వ‌చ్చాయి అని అన్నారు. గత ఏడాది జనవరి నుంచి ఆయనకు అష్టమ శని స్టార్ట్ అయిందని చాలా దారుణమైన పరిస్థితుల్లోకి వెళతాడని వేణు స్వామి కుండ బద్దలు కొట్టారు. ఆయనను తొక్కేస్తున్నారని ఆయన అభిమానులు అంటున్నారు అంటే అసలు ఆయనను తొక్కేసే అవసరం ఎవరికి ఉంది? ఆయనను తొక్కేసే అంత సినిమా ఆయనకు లేదు అని వేణు స్వామి అన్నారు.

Venu Swamy sensational comments on Vijay Devarakonda
Venu Swamy

లైగ‌ర్ సినిమా ఫ్లాప్ త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ చాలా డీలా ప‌డ్డారు. ఆయ‌న చిత్రాలు వ‌రుస‌గా ఫ్లాప్ అవుతున్న నేప‌థ్యంలో వేణు స్వామి మాట్లాడుతూ.. విజయ్ కి అష్టమి నడుస్తోందన్నారు. ఆయన జాతకం ప్రకారం.. అష్టమ శని ప్రారంభం అవ్వడం తో లైగర్ కు ముందు వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం కూడా డిజాస్టర్ అయ్యిందన్నారు. ఇంకొన్నాళ్లు ఈ ప్రభావం ఉంటుందన్నారు. ఆయ‌న‌కు మ‌న్ముందు కూడా క‌ష్టంగానే ఉంటుంద‌న్నారు. మ‌రి వేణు స్వామి వ్యాఖ్య‌లు విజ‌య్ విష‌యంలో ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తాయో చూడాలి.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

7 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

11 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

11 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

11 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

11 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

11 months ago