Venu Swamy : 2024లో సీఎం ఎవరో తేల్చి చెప్పిన వేణు స్వామి.. ఆయ‌న జ్యోతిష్యం నిజ‌మ‌వుతుందా..!

Venu Swamy : ప్ర‌ముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి ఇటీవ‌లి కాలంలో వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తున్నాడు. స‌మంత‌, నాగ చైత‌న్య పెళ్లి త‌ర్వాత విడిపోతార‌ని చెప్ప‌గా ఆ విష‌యం నిజం కావ‌డంతో అప్ప‌టి నుండి హాట్ టాపిక్ అవుతున్నాడు. సాధార‌ణంగా ఆయ‌న‌ సెలబ్రిటీలకు, రాజకీయ ప్రముఖులకు జ్యోతిష్యం చెప్తూ సినీ, పొలిటికల్ ఆస్ట్రాలజర్‌గా మారాడు. సరిగ్గా నాలుగేళ్ల క్రితం.. సమతం, నాగ చైతన్య పెళ్లి చేసుకోవడానికి ముందే.. వాళ్లు వైవాహిక జీవితంలో ఇబ్బందులు పడతారని.. విడిపోతారని.. సంతానం విషయంలో కూడా సమస్యలు తలెత్తుతాయని చెప్పాడు.

అఖిల్‌కి నిశ్చితార్థం అయినా పెళ్లి మాత్రం జరగదని అప్పట్లోనే చెప్పారు వేణు స్వామి. అయితే అతను చెప్పినట్టుగానే అఖిల్ పెళ్లి క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందే. దీంతో వేణు స్వామి నేను చెప్పినట్టే జరిగింది అంటూ ఈ ఇష్యూని క్యాష్ చేసుకుంటున్నారు. ఈయన ఇటీవల 2024లో సీఎం ఎవ‌రు అవుతార‌నేది కూడా చెప్పుకొచ్చాడు. జగన్ గారి జాతకం ప్రకారం ఆయన్ని టార్గెట్ చేయాలి అనుకుంటే 2022 ఏప్రిల్ 25లోపు టార్గెట్ చేయాలి.. ఆ స‌మ‌యంలో ఆయనకు అష్టమశని నడుస్తోంది. అది దాటింది అంటే ఎవరూ ఏమీ చేయలేరు.

Venu Swamy told who will be cm in ap in 2024
Venu Swamy

2019లో జగన్ కి జాతకపరంగా స్టార్ట్ అయిన ఫేజ్.. 2022 ఏప్రిల్ 1వ తేదీకి క్లోజ్ అవుతుంది. అంటే.. 2022 ఏప్రిల్ 2 నుంచి రాజకీయంగా చాలా రాష్ట్రాలలో రాజకీయపరమైన మార్పులు వస్తున్నాయి. అందులో ఏపీ కూడా ఉంది.. ప్ర‌స్తుతం జగన్ మోహన్ రెడ్డి పాజిటివ్ వైపు వెళ్తున్నారు.. మిగిలిన వాళ్లు నెగిటివ్ వైపు వెళ్తున్నారు. 2024లో కూడా జగనే సీఎం. ఎలాగంటే ఆయనకు బుధమహర్ధశ స్టార్ట్ అయ్యింది. 2019లో స్టార్ట్ అయిన ఈ బుధమహర్దశ 17 ఏళ్లు పాటు ఉంటుంది. 17 ఏళ్ల పాటు ఆయనే సీఎంగా ఉంటారు. 2019 నుంచి 17 ఏళ్లు అని నేను చెబుతున‌న్నాను.. సీఎం పదవి ఎక్కినప్పటి నుంచి లెక్క.. అంటే మూడు సార్లు సీఎం అవుతారు. మిగిలిన రెండేళ్లలో ఆయనకు గండాలు ఉన్నాయి. వాటి గురించి తరువాత చెప్తా కానీ.. వచ్చే ఎన్నికల్లో మాత్రం జగన్ సీఎం అని వేణు స్వామి చెప్పుకొచ్చారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

9 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

9 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago