Vijayendra Prasad : ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి రాజ‌మౌళి తండ్రి అంత మాట అనేశాడేంటి..!

Vijayendra Prasad : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు ఒక న‌టుడే కాదు రాజ‌కీయ నాయ‌కుడు కూడా. జ‌న‌సేన అనే పార్టీని స్థాపించి ఇప్పుడు ఏపీలో త‌మ పార్టీ స‌త్తా ఏంటో చూపించేందుకు సిద్ధ‌మవుతున్నాడు. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై ఇటీవ‌ల కొంద‌రు ప్ర‌శంస‌లు కురిపిస్తుంటే, మరి కొంద‌రు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈక్ర‌మంలోనే పవన్ కల్యాణ్‌పై బాహుబలి రైటర్, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాసేవ అంటే దోచుకోవడం, దాచుకోవడంగా మారింది. అలాంటి తరుణంలో గొప్ప నేతగా పవన్ కల్యాణ్ కనిపించాడు అని ఆయన అన్నాడు. హైదరాబాద్‌లో మహా టెలివిజన్‌ కొత్తగా ప్రారంభించిన ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ మహా మ్యాక్స్ కార్యక్రమంలో పవన్ కల్యాణ్, విజయేంద్ర ప్రసాద్, దిల్ రాజు తదితరులు హాజ‌ర‌య్యారు.

ఈ కార్య‌క్ర‌మంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి విజ‌యేంద్ర ప్ర‌సాద్ మాట్లాడుతూ.. రీసెంట్ గా ఓ వీడియో చూశానని అందులో విజయవాడలో దుర్గమ్మ ఆలయానికి వచ్చిన హిందువులకి దాహార్తి తీర్చడానికి ముస్లింలు మజ్జిగ పంపిణీ చేస్తున్నారు ఆ దృశ్యం నాకు ఎంతో ఆనందం కలిగించి ఇప్పటికీ కూడా దానిని తలచుకున్నా అంతే ఆనందంగా ఉందని తెలిపారు. అయితే రానున్న రోజుల్లో కూడా ఇలాంటి వాతావరణమే ఉండాలి ఇలాంటివి జరగాలి అంటే నీతి నిబద్ధత ఉన్న నాయకుడు కావాలి అయితే అదృష్టవశాత్తు మనకి పవన్ కళ్యాణ్ ఉన్నారు. మీరు అంటే ప్రాణం ఇచ్చే అశేషమైన జన సైనికులు ఉన్నారు. నేను ఏం చెప్పానో అది దయచేసి మీవారితో చెప్పి మతసామరస్యం పెంచడం కోసం అందుకు అవకాశం, అదృష్టం రెండూ మీకు ఉన్నాయి చెయ్యండి అంటూ తెలిపారు.

Vijayendra Prasad sensational comments on pawan kalyan
Vijayendra Prasad

అయితే విజయేంద్ర ప్రసాద్ సహా పవన్ కూడా మన దేశం పట్ల అపారమైన దేశభక్తి కలవారు మరి పవన్ ఈ విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకుంటాడో అని అంద‌రు ఆలోచ‌న‌లు చేస్తున్నారు. నేటి తరం రాజకీయాల గురించి విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ఏం మాట్లాడుతారో.. ఏం ఆలోచిస్తూ ఏం మాట్లాడుతారో అనే విధంగా ఒక నీతి, నిజాయితీ కల లీడర్ కావాలి. మన అదృష్టం కొద్ది మనకు పవన్ కల్యాణ్ లాంటి లీడర్ దొరికాడు అని పవన్ కల్యాణ్‌ను ప్రశంసలతో ముంచెత్తాడం కొస‌మెరుపు.విజ‌యేంద్ర ప్ర‌సాద్‌కి అలానే రాజ‌మౌళికి కూడా ప‌వ‌న్ అంటే ఎంతో ఇష్టం. ఆయ‌న‌తో సినిమాలు చేయాల‌ని వార‌ద్ద‌రు కోరుకుంటున్నారు. మ‌రి జ‌రుగుతుందా లేదా అనేది చూడాలి.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

9 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

9 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago