Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆరోగ్యానికి ఏమైంది..? టెన్ష‌న్‌లో ఫ్యాన్స్..

Pawan Kalyan : పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర అనారోగ్యం బారిన ప‌డ్డారు. గత రెండు రోజులుగా వైరల్ ఫీవర్‌తో ఇబ్బంది పడుతున్నారు. జ్వరంతో పాటు ఆయన తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారు. అయితే, ఆయన తీవ్ర అస్వస్థతతో ఉన్నప్పటికీ తన నివాసంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్ అధికారులతో సమావేశమయ్యారు. వరద పరిస్థితిపై సమీక్షలు జరిపారు. ఏయే ప్రాంతాల్లో అయితే.. వరద నీరు తగ్గుముఖం పట్టిందో అక్కడ.. పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని, సూపర్ క్లోరినేషన్ చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ వరద బాధితులను ఆదుకోవడానికి తాను వ్యక్తిగతంగా కోటి రూపాయలు విరాళం ఇస్తానని ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు.

తెలంగాణ వరద బాధితులకు కూడా కోటి రూపాయలు విరాళం అందిస్తానని పవన్ కల్యాణ్ మాట ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో కలిసిన జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సీఎం సహాయ నిధికి కోటి రూపాయలు విరాళం అందించారు. విజయవాడ కలెక్టర్ ఆఫీసు కార్యాలయంలో వినాయక చవితి సందర్బంగా ఏర్పాటు చేసిన గణపతికి పూజలు చేసిన అనంతరం పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు. ఇదే సమయంలో విజయవాడ తో పాటు ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టంపై సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చర్చించారని సమాచారం.

what happened to Pawan Kalyan is he got any illness
Pawan Kalyan

కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోగ్యం గురించి సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని మీరు త్వరగా కోలుకొని ప్రజాసేవ చెయ్యాలని సీఎం చంద్రబాబు డీసీఎం పవన్ కల్యాణ్ కు సూచించారని సమాచారం. ఇక ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న గ్రామాలకు నాలుగు కోట్ల రూపాయల తన వ్యక్తిగత సొమ్ము అందిస్తానని ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. 400 గ్రామాల అభివృద్ధి కోసం నాలుగు కోట్ల రూపాయలు ఆయా గ్రామాల బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

9 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

9 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago