Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Roja : వైసీపీకి రాజీనామా చేయ‌నున్న రోజా..? క్లారిటీ ఇచ్చేశారుగా..!

Shreyan Ch by Shreyan Ch
September 1, 2024
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Roja : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ చెందిన చాలా మంది నాయ‌కులు క‌నిపించకుండా పోయారు. ముఖ్యంగా రోజా ఈ మ‌ధ్య కాలంలో క‌నిపించ‌డ‌మే మానేసింది. ఇక ఆమె పార్టీ మారుతుందంటూ కూడా అనేక వార్త‌లు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేశాయి. ఈ క్ర‌మంలో రోజా తాజాగా స్పందించింది. అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారి తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి ఆర్‌కే రోజా సెల్వమణి దర్శించుకున్నారు. మంత్రిగా తిరుమలలో హల్‌చల్‌ చేసిన రోజా మాజీ మంత్రి హోదాలో తిరుమలను సందర్శించారు. ఎలాంటి హడావుడి లేకుండా ఆమె తిరుమలలో పర్యటించారు. ఇటీవల ఆమె తన వ్యక్తిగత సోషల్‌ మీడియాలో వైఎస్సార్‌సీపీ, మాజీ సీఎం జగన్‌కు సంబంధించిన ఫొటోలు, వివరాలను తొలగించారు.

దీంతో ఆమె వైసీపీకి రాజీనామా చేస్తారనే వార్తలు కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో తిరుమల సందర్శించిన సమయంలో మీడియా ఆమెను ప్రశ్నల వర్షం కురిపించారు. పార్టీ మారుతున్నారా? అని ప్రశ్నించగా రోజా వాటిని కొట్టిపారేశారు. కాగా తిరుమలలో ఆమె రాజకీయ విమర్శలు చేయడం కలకలం రేపాయి. తిరుమలలో రాజకీయాలు మాట్లాడవద్దని నిర్ణయించిన సమయంలో మళ్లీ ఆమె రాజకీయ విమర్శలు చేయడం తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక దర్శనం చేసుకున్న అనంతరం రోజా మీడియాతో మాట్లాడారు. ‘పార్టీ మారుతానని జరుగుతున్న ప్రచారం ఊహాగానమే’ అని కొట్టిపారేశారు. ఇక ఏపీలో కూటమి పాలనపై రోజా తీవ్ర విమర్శలు చేశారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు రక్షణ లేకుండాపోయింది. కొద్ది రోజులుగా రాష్ట్రంలో మహిళలపై జరిగిన సంఘటనపై ప్రభుత్వం సిగ్గుపడాలి’ అని వ్యాఖ్యలు చేశారు.

Roja given clarity on changing from ysrcp what she said
Roja

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి ప్రజలు ఓడించిన ఓటమి కాదు. ఎందుకంటే ఏ తప్పు చేయలేదు. ఇంత ఘోరంగా పోవాల్సినంతగా తప్పులు పార్టీ, నాయకత్వం చేయలేదు. ఏం జరిగిందనేది ఈ రోజు కాకపోయినా.. ఏదో రోజు బయటకు వస్తుంది. ఆ రోజు ప్రజలు వాస్తవాలు తెలుసుకొంటారు అని రోజా అన్నారు. గత కొద్దికాలంగా వైఎస్ఆర్సీపీ ఓటమికి ఈవీఎంలే కారణమనే ఆరోపణలతో ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. 40 శాతం ఓట్లు పడినా మేము ఎలా ఓడిపోతామని పలువురు కొత్త లాజిక్ తెరపైకి తెచ్చారు. ఈ నేపథ్యంలో రోజా తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆ కోణంలో చేసినవేనా అనే చర్చ మొదలైంది.

Tags: Roja
Previous Post

Perni Nani : ముంబై న‌టి కేసు అంతా ఒక డ్రామా.. పేర్ని నాని..

Next Post

Kadambari Jethwani : ముంబై న‌టిపై హ‌నీ ట్రాప్ కేసులు ఉన్నాయి.. వైసీపీ..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Perni Nani : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై పేర్ని నాని కామెంట్స్.. పవన్ శ్వాస పీల్చేది, వదిలేది చంద్రబాబు కోసమే..

by Shreyan Ch
November 26, 2023

...

Read moreDetails
politics

Ambati Rambabu : సాయిధ‌ర‌మ్ తేజ్‌కి స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చిన అంబ‌టి.. ఆగని బ్రో వివాదం..

by Shreyan Ch
August 5, 2023

...

Read moreDetails
వార్త‌లు

Mohan Babu : చంద్ర‌మోహ‌న్ మృతితో ఫుల్ ఎమోష‌న‌లైన మోహ‌న్ బాబు.. న్యూజిలాండ్ నుండి వీడియో మెసేజ్

by Shreyan Ch
November 12, 2023

...

Read moreDetails
special interest

Ghost : ఇంట్లో దెయ్యం ఉంటే.. ఎలాంటి ల‌క్ష‌ణాలు, సూచ‌న‌లు క‌నిపిస్తాయో తెలుసా..?

by editor
September 7, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.