Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home ఆధ్యాత్మికం

శివ లింగాన్ని ముందుగా నంది కొమ్ముల నుంచి చూస్తూనే ద‌ర్శించుకోవాలి.. ఎందుకంటే..?

editor by editor
August 2, 2022
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

ప్ర‌పంచ‌వ్యాప్తంగా శివాల‌యాలు ఎన్నో ఉన్నాయి. అనేక దేశాల్లోనూ ఎన్నో చారిత్ర‌క ఆల‌యాలు ఉన్నాయి. మ‌న దేశంలో చాలా పురాత‌నమైన శివాల‌యాల‌ను మ‌నం చూడ‌వ‌చ్చు. అయితే మ‌నం ఏ శివాల‌యానికి వెళ్లినా స‌రే.. మ‌న‌కు శివుడు లింగ రూపంలోనే ద‌ర్శ‌నం ఇస్తాడు. ఆయ‌న‌కు రూపం ఉండ‌దు. ఇక శివున్ని ద‌ర్శించుకుంటానికి ముందు గ‌ర్భ‌గుడి ఎదురుగా ఉండే నంది కొమ్ముల నుంచి ముందుగా శివ‌లింగాన్ని చూడాలి. ఆ త‌రువాతే గ‌ర్భ‌గుడిలోకి వెళ్లాలి. ఇలా ఎందుకు ద‌ర్శించుకోవాల‌నే విషయాన్ని పండితులు తెలియ‌జేస్తున్నారు. దీని వెనుక ఉన్న కార‌ణాన్ని వారు చెబుతున్నారు.

సాధార‌ణంగా మ‌నం ఏ దేవున్ని లేదా దేవ‌త‌ను ద‌ర్శించుకున్నా నేరుగా గ‌ర్భ‌గుడిలోకి వెళ‌తాం. కానీ శివున్ని మాత్రం ముందుగా నంది కొమ్ముల నుంచి ద‌ర్శించుకోవాలి. ఆ త‌రువాతే గ‌ర్భ‌గుడిలోకి వెళ్లాలి. ఇలా ఎందుకు చేయాలంటే.. శివుడు త్రిమూర్తుల‌లో ఒక‌రు. ఆయ‌న‌కు రూపం ఉండ‌దు. ఆయన్ను లింగ రూపంలో ద‌ర్శించుకోవాలి. శివుడు ల‌య కారకుడు. ఆయ‌న‌కున్న మూడో క‌న్ను తెరిస్తే సృష్టి అంత‌మ‌వుతుంది. స‌క‌లం భ‌స్మం అయిపోతుంది. అంత‌టి శ‌క్తి ఆయ‌న మూడో క‌న్నుకు ఉంటుంది. క‌నుక అలాంటి శ‌క్తివంతున్ని నేరుగా ద‌ర్శించుకోరాదు. ముందుగా నంది కొమ్ముల నుంచి చూసి లింగ ద‌ర్శ‌నం చేసుకున్నాకే ఆల‌యం లోప‌లికి వెళ్లి లింగాన్ని చూడాలి. అంతే కానీ నేరుగా శివాల‌యం గ‌ర్భ‌గుడిలోకి వెళ్లరాదు. వెళితే అరిష్టం చుట్టుకుంటుంద‌ని పురాణాలు చెబుతున్నాయి.

we should see lord shiva with the help of nandi

క‌నుక శివాల‌యంలో ముందుగా శివున్ని నంది కొమ్ముల నుంచి చూసి ద‌ర్శించుకున్నాకే గ‌ర్భ‌గుడిలోకి వెళ్లి ద‌ర్శ‌నం చేసుకోవాలి. ఇక నంది కొమ్ముల నుంచి శివ‌లింగాన్ని చూస్తూ ద‌ర్శ‌నం చేసుకునేట‌ప్పుడు.. నంది వీపుపై నిమురుతూ మ‌న కుడి చేతితో నంది చెవి మూయాలి. అనంత‌రం మ‌న మ‌న‌స్సులో ఉన్న కోరిక‌ల‌తోపాటు మ‌న పేరు, మ‌న కుటుంబ స‌భ్యుల పేర్లు, గోత్రాలు చెప్పాలి. అలా చెబుతూ.. నంది కొమ్ముల నుంచి చూస్తూ.. శివ‌లింగాన్ని ద‌ర్శించుకోవాలి. ఇలా చేస్తే కోరిన కోరిక‌లు నెర‌వేరుతాయ‌ని పురాణాలు చెబుతున్నాయి. అలాగే భ‌క్తుల‌కు కైలాస ప్రాప్తి క‌లుగుతుంద‌ట‌. మ‌రుస‌టి జ‌న్మ కూడా ఉండ‌ద‌ని పండితులు చెబుతున్నారు. క‌నుక శివాలయంలో శివున్ని ద‌ర్శించుకునేట‌ప్పుడు ముందు తెలిపిన విధంగా చేస్తే మంచిది. అన్ని విధాలుగా మేలు జ‌రుగుతుంది.

Tags: lord shivanandishiva lingam
Previous Post

ప‌సుపుతో ఎన్ని ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా ?

Next Post

4జి వీవోఎల్‌టీఈ ఫోన్‌ను లాంచ్ చేసిన నోకియా.. ధ‌ర ఎంతో తెలుసా ?

editor

editor

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

special interest

Keys Tag : తాళం చెవుల‌కు ఉండే ట్యాగ్‌పై నంబ‌ర్ ఉంటుంది క‌దా.. అదేమిటో తెలుసా..?

by editor
October 5, 2022

...

Read moreDetails
వార్త‌లు

Yashoda Movie : యశోద సీక్వెల్‌కి కూడా స‌మంత రెడీ.. ఖాకీ దుస్తుల్లో అద‌ర‌గొట్ట‌నున్న సామ్..

by Shreyan Ch
November 17, 2022

...

Read moreDetails
టెక్నాల‌జీ

4జి వీవోఎల్‌టీఈ ఫోన్‌ను లాంచ్ చేసిన నోకియా.. ధ‌ర ఎంతో తెలుసా ?

by editor
August 3, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

రోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను త‌ప్ప‌క తాగాలి.. అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు..!

by editor
July 26, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.