Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Shreyan Ch by Shreyan Ch
September 19, 2024
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఇక కొద్ది రోజులుగా పార్టీ ముఖ్య‌నేత బాలినేని శ్రీనివాస రెడ్డి పార్టీని వీడ‌నున్న‌ట్టు జోరుగా ప్ర‌చారం సాగింది. ఈ క్ర‌మంలో ఆయ‌న తాజాగా. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అధినేత వైఎస్ జగన్‌కు రాజీనామా లేఖ మెయిల్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి పార్టీ తీరుపై బాలినేని అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల అధినేత జగన్ మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు. ఆ భేటీ తర్వాత కూడా అసంతృప్తితో ఉన్నారు. వైసీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో బాలినేని శ్రీనివాస రెడ్డి గురువారం సమావేశం అవుతున్నారు. ఆ భేటీ తర్వాత జనసేన పార్టీలో చేరికపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

కొన్ని కారణాల రీత్యా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు బాలినేని. రాజీనామా లేఖలో ఆయన కీలక విషయాలను ప్రస్తావించారు. రాజకీయాలు వేరు, బంధుత్వాలు వేరన్నారు. జగన్ నిర్ణయాలు సరిగా లేనప్పుడు వ్యతిరేకించినట్లు చెప్పారు. రాజకీయాల్లో భాష గౌరవంగా, హుందాతనంగా ఉండాలన్నారు. రాజకీయాల్లో విలువలు కాపాడాల్సిన బాధ్యత నాయకులదే అని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ఎవరు వచ్చినా సాయం చేసినట్లు బాలినేని తెలిపారు. విలువలు నమ్ముకుని ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా.. రెండుసార్లు మంత్రిగా పనిచేశానని బాలినేని లేఖలో ప్రస్తావించారు. ఇప్పుడు కొన్ని కారణాలతో వైసీపీ వీడుతున్నట్లు తెలిపారు.

Balineni srinivasa reddy left ysrcp
Balineni

వైసీపీ అధినేత జగన్‌తో బాలినేని శ్రీనివాస రెడ్డికి సాన్నిహిత్యం ఉంది. వైసీపీ ముఖ్యనేత వైవీ సుబ్బారెడ్డి సోదరిని బాలినేని వివాహం చేసుకున్నారు. దివంగత వైఎస్ఆర్, జగన్ మోహన్ రెడ్డికి బాలినేని బంధువు కూడా అవుతారు. ఒంగోలు అసెంబ్లీ నుంచి బాలినేని 1999, 2004, 2009, 2012లో నాలుగుసార్లు పోటీ చేసి గెలుపొందారు. 2012లో బాలినేని శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి, వైసీపీలో చేరారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి దామచర్ల జనార్ధన రావు చేతిలో ఓడిపోయారు. 2019లో మాత్రం టీడీపీకి అభ్యర్థి జనార్ధన రావును ఓడించారు.2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది. ఆ వెంటనే బాలినేని శ్రీనివాస రెడ్డికి మంత్రి పదవి దక్కింది. రెండేళ్లు అటవీ, పర్యావవరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా పనిచేశారు. 2023లో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ సమయంలో బాలినేని మంత్రి పదవి పోయింది. అప్పటి నుంచి పార్టీతో అంటిముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు.

Tags: balineni
Previous Post

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

Next Post

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Vangalapudi Anitha : రోజు రోజుకీ దారుణంగా మారుతున్న అనిత ప‌రిస్థితి.. ఇలా అయిందేంటి..?

by Shreyan Ch
June 12, 2023

...

Read moreDetails
వార్త‌లు

Venkatesh : ఒకే టైటిల్ తో వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ, విక్టరీ వెంకటేష్ చిత్రాలు.. ఏది హిట్ అయిందంటే..?

by Mounika Yandrapu
November 12, 2022

...

Read moreDetails
special interest

Sleep : నిద్ర‌లో ఉన్న‌ప్పుడు ఛాతి మీద ఏదో ఉన్న‌ట్లు అనిపించిందా ? అయితే అది ఇదే..!

by editor
September 19, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Gurivinda Seeds : గురివింద గింజ‌ల‌తో ఎన్నో ఉప‌యోగాలు.. తెలిస్తే వెంట‌నే ఇంటికి తెచ్చుకుంటారు..!

by editor
October 9, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.