Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

అల్ల‌రి అల్లుడు మూవీ అప్ప‌ట్లో ఎంత వ‌సూలు చేసిందో తెలుసా.. షాక‌వుతారు..!

editor by editor
February 7, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

కింగ్ నాగార్జున వైవిధ్య భ‌రిత‌మైన పాత్ర‌ల‌ను చేయ‌డంలో పెట్టింది పేరు. ఆయ‌న ఎన్నో సినిమాల్లో డిఫ‌రెంట్ రోల్స్‌లో న‌టించి అల‌రించారు. ఇక నాగార్జున న‌టించిన సినిమాల్లో అల్ల‌రి అల్లుడు కూడా ఒక‌టి. ఇది ఓ వైపు ప‌క్కా మాస్ త‌ర‌హాలో సాగుతుంది. కానీ సెంటిమెంట్‌, ఫ్యామిలీ విలువ‌ల‌ను కూడా చెబుతుంది. అందుక‌నే ఈ మూవీ ఆయన టాప్ 10 సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. శివ చిత్రం త‌రువాత నాగార్జున చేసిన భిన్న‌మైన మూవీ ఇది. ఈ క్ర‌మంలోనే ఈ మూవీ ఆయ‌న‌కు చ‌క్క‌ని హిట్‌ను అందించింది. ఆ త‌రువాత నాగార్జున మాస్ హీరోగా మ‌రింత ఖ్యాతి సాధించారు.

ఇక అల్ల‌రి అల్లుడు మూవీని తీయ‌డం వెనుక పెద్ద క‌థే ఉంది. శివ తర్వాత విభిన్న తరహా మూవీస్ చేసిన నాగ్ కి నిర్ణయం, కిల్లర్ మూవీస్ తప్ప మిగిలినవేవీ హిట్ కాలేదు. అదే సమయంలో పక్కా మాస్ మూవీ ప్రెసిడెంట్ గారి పెళ్ళాం హిట్ ఇచ్చింది. దాంతో మాస్ కథలతో రావాలని ప్రొడ్యూసర్స్ కి చెప్పేశారు. ఇక అక్కినేని వీరాభిమాని డి శివప్రసాదరెడ్డి ఆలస్యం చేయకుండా ప్రెసిడెంట్ గారి పెళ్ళాం కథ రాసిన తోటపల్లి మధుకి మద్రాసులో ఓ రూమ్ తీసి, నాగ్ కి మంచి మాస్ కథ చేయమని చెప్పేశారు. దాంతో అత్తా అల్లుడు మధ్య సరదా సీన్స్ తో కథ రెడీ చేశారు. నిర్మాతకు, నాగ్ కి నచ్చేయడంతో కోదండరామిరెడ్డి డైరెక్టర్ గా సినిమాకు రెడీ అయ్యారు. మీనా, నగ్మా హీరోయిన్స్ . కీరవాణి మ్యూజిక్ అందించారు.

allari alludu movie collections how much

పొగరుబోతు అత్త పాత్ర‌కు బ్రాండ్ అంబాసిడర్ గా నిల్చిన వాణిశ్రీ, మురళీమోహన్, రావు గోపాలరావు, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, చలపతిరావు ఇత‌ర న‌టీన‌టులుగా చేశారు. 1993 ఏప్రిల్ లో షూటింగ్ స్టార్ట్ అయింది. చెన్నై ఏవీఎం స్టూడియో, ముదుమలై పార్క్, ఊటీ, హైదరాబాద్ అన్నపూర్ణ, పద్మాలయ స్టూడియోస్, రాజమండ్రిలలో షూటింగ్ చేశారు. చాలా టైటిల్స్ అనుకున్నా చివరకు అల్లరి అల్లుడు పేరుతో నాగ్ పుట్టినరోజు ఆగస్టు 29న పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక రమ్యకృష్ణ స్పెషల్ సాంగ్ చేశారన్న వార్త సినిమాకు క్రేజ్ పెంచింది. ఆడియో హిట్. పాటలన్నీ మారుమోగాయి. అక్టోబర్ 6న మూవీ రిలీజ్. అప్పటికే బంగారు బుల్లోడు, అబ్బాయిగారు మంచి టాక్స్ తో హిట్ అయి థియేటర్లలో ఆడుతున్నాయి. దాంతో 72 ప్రింట్లతో 142 థియేటర్స్ లో అల్ల‌రి అల్లుడు విడుదలైంది.

ఈ సినిమాకు ఫాన్స్ హడావిడి ఎక్కువ చేశారు. రాజమండ్రిలో 101 అడుగుల కటౌట్ పెట్టడంతో సంచలనంగా మారింది. కటౌట్ చూడ్డానికే థియేటర్ కి చాలామంది వచ్చేవారు. ఇక నాగ్ మాస్ యాక్టింగ్, మాస్ కామెడీ, ఫైట్స్ తో , స్టెప్స్ తో అదరగొట్టేశాడు. మీనా, నగ్మా గ్లామర్, వాణిశ్రీ, రావు గోపాలరావు యాక్టింగ్ ప్లస్ పాయింట్స్. మొదట్లో నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. కానీ నెమ్మ‌దిగా పుంజుకుని హిట్ అయింది. మొదటి వారం రూ.1 కోటి 10 లక్షల షేర్ ను కలెక్ట్ చేయ‌గా.. ఆయా జిల్లాల్లో, హైదరాబాద్ లో రికార్డ్ క్రియేట్ చేసింది. బి సెంటర్స్ లో మొదటి వారం భారీ రికార్డ్స్ న‌మోద‌య్యాయి. సీడెడ్ లో రూ.70 లక్షలు కలెక్ట్ చేసి రాయలసీమలో రికార్డ్ ను క్రియేట్ చేసింది. 22 సెంటర్స్ లో 100 డేస్ ఆడింది. టోటల్ గా రూ.7 కోట్ల 20 లక్షల షేర్ కలెక్ట్ చేసింది. 1993 టాప్ గ్రాసర్ గా ఆల్ టైం టాప్ 4 మూవీగా నిలిచింది. నాగ్ మాస్ మూవీస్ కి ప్రధాన కారణం అల్లరి అల్లుడు హిట్ అవ‌డ‌మే అని చెప్ప‌వ‌చ్చు. ఆ త‌రువాత నాగ్ వెన‌క్కి తిరిగి చూడ‌లేదు. ఎన్నో మాస్ చిత్రాల‌తో అల‌రించారు.

Tags: allari alluduNagarjuna
Previous Post

రోజూ మ‌నం ఎంత ఉప్పును తింటున్నామో తెలుసా..? న‌మ్మ‌లేని నిజం.. షాక‌వుతారు..!

Next Post

మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే శుభ‌వార్త‌.. వాల్తేరు వీర‌య్య ఓటీటీలో..

editor

editor

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

special interest

Keys Tag : తాళం చెవుల‌కు ఉండే ట్యాగ్‌పై నంబ‌ర్ ఉంటుంది క‌దా.. అదేమిటో తెలుసా..?

by editor
October 5, 2022

...

Read moreDetails
వార్త‌లు

Yashoda Movie : యశోద సీక్వెల్‌కి కూడా స‌మంత రెడీ.. ఖాకీ దుస్తుల్లో అద‌ర‌గొట్ట‌నున్న సామ్..

by Shreyan Ch
November 17, 2022

...

Read moreDetails
టెక్నాల‌జీ

4జి వీవోఎల్‌టీఈ ఫోన్‌ను లాంచ్ చేసిన నోకియా.. ధ‌ర ఎంతో తెలుసా ?

by editor
August 3, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

రోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను త‌ప్ప‌క తాగాలి.. అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు..!

by editor
July 26, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.