Telugu News 365
  • వార్త‌లు
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Allu Sneha Reddy : కూతురితో క‌లిసి సంద‌డి చేసిన స్నేహా రెడ్డి.. ఇద్ద‌రిని చాలా రోజుల త‌ర్వాత ఇలా చూసి ఫ్యాన్స్ ఖుష్‌

Shreyan Ch by Shreyan Ch
January 30, 2024
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Allu Sneha Reddy : అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహా రెడ్డి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. బన్నీ భార్యగానే అందరికీ పరిచయమైన స్నేహా.. తనకంటూ ప్రత్యేకత ఉండేలా చూసుకుంటూ గుర్తింపు సాధించారు. వ్యాపార రంగంలోకి కూడా అడుగు పెట్టారు. పిల్లల కోసమే ప్రత్యేకంగా ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టారు. పికబు అంటూ చిన్నారుల అవసరాలు, వారి ఆట వస్తువులు, వారిలో క్రియోటివిటీని పెంచేలా, వారిని ఎప్పుడూ యాక్టివ్ గా ఉండేలా చేసే పలు ఉత్పత్తులను అందుబాటులో ఉంచారు. రీసెంట్‌గా కూతురితో క‌లిసి వెళ్లిన స్నేహా రెడ్డి తెగ సంద‌డి చేసింది.

అర్హ అయితే గేమ్స్ స‌ర‌దాగా ఆడుతూ హుషారుగా క‌నిపించింది. అర్హ‌ని అలా చూసి ప్ర‌తి ఒక్క‌రు మురిసిపోతున్నారు. ఇక ఇదిలా ఉంటే అల్లు స్నేహా పిల్లల పెంపకం గురించి ఓ వీడియోను తన ఇన్ స్టా అకౌంట్ లో షేర్ చేసుకున్నారు. ఈ తరం పిల్లలు అయితే చదువులు లేదా ఇంటికి వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. తల్లిదండ్రులు కూడా అల్లరి చేయకుండా ఒక దగ్గర కూర్చుని ఫోన్ చూస్తుండటంతో తలనొప్పి తగ్గిందని స్మార్ట్ ఫోన్లు అలవాటు చేస్తుంటున్నారు. దీని వల్ల పిల్లల్లో ఫిజికల్ యాక్టివిటీ తగ్గుతోంది. క్రియేటివిటీ లోపిస్తోంది. పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి, వారికి ఫిజికల్ యాక్టివిటిని పెంచడానికి స్నేహా కొన్ని టిప్స్ ఇచ్చారు.

Allu Sneha Reddy playing with her daughter arha
Allu Sneha Reddy

మొత్తం 6 పాయింట్లను తల్లిదండ్రులకు సూచించారు అల్లు స్నేహా. వాటిని పాటిస్తే పిల్లల్లో క్రియేటివిటీ పెరుగుతుందని చెప్పుకొచ్చారు. పిల్లలను ఎప్పుడూ మోటివేట్ చేస్తూ ఉండాలని, క్రియేటివ్ గా ఆలోచించాలని ప్రోత్సహించాలని మొదటి పాయింట్ చెప్పారు. వారం పాటు షెడ్యూల్ ప్రిపేర్ చేసి దానిని ఫాలో అవాలని, దీని వల్ల పిల్లల్లో క్రమశిక్షణ పెరుగుతుందన్నారు. ఆరు బయట ఆడుకోనివ్వాలి, ప్రకృతి నుంచి కొత్త విషయాలు తెలుసుకోనివ్వాలి. ఫోన్, టీవీ, ల్యాప్‌టాప్ చూసే సమయాన్ని తగ్గించాలి. ఆలోచనా శక్తి పెంచుకునేలా ఎంకరేజ్ చేయాలి. జాలి, దయతో ఉండాలని వారికి నేర్పాలి. అలాగే మిగతా అన్ని పాయింట్లతో సమానమైన ప్రాముఖ్యత ఇవ్వాల్సింది ఆరో పాయింట్. అదే తమకు తాము కొంత సమయాన్ని కేటాయించుకోవడం అని చెప్పుకొచ్చారు.

Tags: allu sneha reddy
Previous Post

Ravi Teja : థియేట‌ర్స్ ఇవ్వ‌క‌పోయిన నువ్వు ఏందో చూపించావు.. ర‌వితేజ షాకింగ్ కామెంట్స్

Next Post

Chiranjeevi : ఎన్టీఆర్ ఫ్లెక్సీ తీయించిన విష‌యంలో బాల‌య్యపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన చిరంజీవి

Shreyan Ch

Shreyan Ch

Related Posts

No Content Available

POPULAR POSTS

viral

Garikapati : గ‌రిక‌పాటి స్పీచ్ వింటే ప‌డిప‌డి న‌వ్వుతారు..!

by Shreyan Ch
June 8, 2023

...

Read moreDetails
వార్త‌లు

Nagababu : వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య త్రిపాఠి పెళ్లిలో వేదిక వ‌ద్ద డ్యాన్స్ చేసిన నాగ‌బాబు

by Shreyan Ch
November 2, 2023

...

Read moreDetails
వార్త‌లు

Arya Movie : ఆర్య సినిమా వెనుక ఇంత క‌థ న‌డిచిందా.. వామ్మో..!

by Shreyan Ch
December 15, 2022

...

Read moreDetails
politics

YSRCP : వైసీపీదే అధికారం..? 120 సీట్లు వ‌స్తాయ‌ట‌..?

by editor
February 3, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.