Dwarampudi Chandrasekhar : పవన్ కళ్యాణ్‌కి దిమ్మ‌తిరిగే పంచ్ ఇచ్చిన ద్వారంపూడి.. తేల్చుకుందాం రా అంటూ స‌వాల్..

Dwarampudi Chandrasekhar : ప్ర‌స్తుతం వారాహి విజ‌య యాత్ర‌లో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటీవ‌ల సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. సర్పవరం జంక్షన్‌ సభలో పవన్.. ద్వారంపూడిని ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఈ క్ర‌మంలో ఆయ‌న వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు ద్వారంపూడి. తనను ఓడిస్తానన్న పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ స్వీకరిస్తున్నానని.. దమ్ముంటే కాకినాడ నుంచి పోటీ చేయాలని సవాల్ చేశారు. ‘నిన్ను తుక్కు తుక్కుగా ఓడించకపోతే నాపేరు చంద్రశేఖర్ రెడ్డి కాదు.. నాపై గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా.. ఓడిపోతే నువ్వు రాజకీయాల నుంచి తప్పుకుంటావా’ అంటూ ఛాలెంజ్ చేశారు.

పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ వ్యభిచారి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2008లో జనసేన పార్టీ పెట్టి ఏం చేశావని పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు. పార్టీ స్థాపించిన నాటి నుండి ఇప్పటికీ ఎవ్వరూ లేరని ఎద్దేవా చేశారు. 3 సవంత్సరాల నుండి రాజకీయంలో ఉన్నాను, ఇప్పటికీ తనతో అందరూ ఉన్నారని వెల్లడించారు. కాకినాడ నగరంలో వ్యాపారం చేసుకుంటూ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని తెలిపారు. కాకినాడలో తన సామాజక వర్గం లేనప్పటికీ అందరూ తాను కావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. “నువ్వు సీఎం అవ్వాలంటే ఒక్క సినిమాలో మాత్రమే సాధ్యం అవుతుంది” అని ఎద్దేవా చేశారు. “నువ్వు ఒక ప్యాకేజ్ స్టార్ వి.. ప్యాకేజ్ కుదరలేదు అందుకే వారాహి పెట్టుకుని రోడ్ పైకి వచ్చావు” అని విమర్శించారు.

Dwarampudi Chandrasekhar counters pawan kalyan
Dwarampudi Chandrasekhar

తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలంటూ స‌వాల్ విసిరారు ద్వారంపూడి రైస్ వ్యాపారం చేస్తూ రూ.15 వేలు సంపాదించాను అన్నావు అసలు నీకు ఏం తెలుసు అని పవన్ ను ఉద్ధేశించి మాట్లాడారు. “కాకినాడ నుండి రైస్ ఎక్స్ పోర్ట్ అవుతుంది అంటే దానికి మా ముఖ్యమంత్రి కారణం.. నీకు జ్ఞానం లేదు, నీ పక్కన మనోహర్ ఉన్నాడు అడిగి తెలుసుకో” అని అన్నారు. తన దగ్గర రూ.15 వేల కోట్లు లేవని.. ఒక వేళ ఉంటే తాను పవన్ కళ్యాణ్ ను కొనేసేవాడినని తెలిపారు. సీఎం పదవిపై ఆశలేదని మార్చి 14న అన్నారని.. ఇప్పుడేమో మాట మార్చి సీఎం అవుతానని మాట్లాడటం విడ్డూరగా ఉందన్నారు. ప్యాకేజీ, సీట్ల బేరం కుదరకే పవన్ రోడ్డుపైకి వచ్చారని.. పవన్ ప్యాకేజీ స్టార్ అన్ని ప్రజలకు తెలుసన్నారు. ఏపీ ప్రభుత్వ విధానాల వల్లనే పోర్టు నుంచి బియ్యం ఎగుమతులు పెరిగాయన్నారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 year ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 year ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago