Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

KTR : తెలంగాణ అసెంబ్లీలో జ‌గ‌న్ పేరు ఎత్తిన కేటీఆర్.. ద‌ద్ద‌రిల్లిన స‌భ‌..

Shreyan Ch by Shreyan Ch
August 7, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

KTR : ప్ర‌స్తుతం తెలంగాణ‌లో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రసవత్తరంగా కొనసాగుతున్న విష‌యం తెలిసిందే సభలో పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. అధికార భారత్ రాష్ట్ర సమితి.. ప్రతిపక్ష కాంగ్రెస్‌పై ఎదురుదాడి చేసింది. రాష్ట్రాభివృద్ధి విషయానికి సంబంధించిన విషయాలపై కేటీఆర్ సహా పలువురు మంత్రులు సభలో మాట్లాడారు. స‌భ‌లో జీఎస్టీ చట్ట సవరణ బిల్లు, పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లు, టిమ్స్‌ ఆసుపత్రుల బిల్లు, కర్మాగారాల చట్ట సవరణ బిల్లు, రాష్ట్రంలో కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు కోసం రూపొందించిన బిల్లు, మైనార్టీ కమిషన్‌ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

తెలంగాణలో పటిష్ఠమైన శాంతి భద్రతల సుస్థిర వ్యవస్థ ఉందని కేటీఆర్ తేల్చి చెప్పారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి భయాందోళనలు అక్కర్లేదని ఆయ‌న అన్నారు.. పొరుగు రాష్ట్రాలు సైతం తెలంగాణలో ఉన్న సుస్థిర శాంతిభద్రతల వ్యవస్థను ప్రశంసిస్తోన్నాయని అన్నారు. ఇక్కడి ప్రతిపక్షాలకు మాత్రం లా అండ్ ఆర్డర్ గురించి పట్టింపుల్లేవని, ప్రభుత్వంపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేటీఆర్ త‌న ప్ర‌సంగంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును ప్ర‌స్తావిస్తూ… దిశ సంఘటన చోటు చేసుకున్న తరువాత తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలు, తీసుకున్న నిర్ణయాల గురించి జగన్.. ఏపీ అసెంబ్లీలో గుర్తు చేసుకున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నిండు సభలో జగన్ సెల్యూట్ చేశారని అన్నారు.

KTR praised cm ys jagan in telangana assemby
KTR

ఇక్కడి శాంతిభద్రతల వ్యవస్థ గురించి మాత్రం భట్టి విక్రమార్క, రఘునందన్ రావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు మాత్రం అర్థం కావట్లేదని ఎద్దేవా చేశారు. సొంత రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతూ ఉంటే.. వారికి ఏ మాత్రం పట్టింపు లేదని, ప్రభుత్వంపై ఏదో ఒకరకంగా బురదచల్లడమే పనిగా పెట్టుకున్నారని చెప్పారు.ఒకప్పుడు ఆంధ్రాలో ఒక ఎకరం అమ్మితే తెలంగాణలో 100 ఎకరాలు కొనుక్కునే పరిస్థితి ఉండేదన్నారు. ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఏపీలో 50 ఎకరాలు కొనచ్చునని అన్నారు. ఈ మాట వాస్తవం కాదా.. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పలేదా అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

Tags: cm ys jaganKTRtelangana assembly
Previous Post

Pawan Kalyan : చిత్తూరు ఎస్పీ నాతో వాదించాడు.. ఎట్ట‌కేల‌కు సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

Next Post

Hyper Aadi : అన్న‌య్య మంచోడు.. త‌మ్ముడు మొండోడు.. ఒక్కొక్క‌రిని క‌డిగిపారేసి హైప‌ర్ ఆది..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

శోభిత ధూళిపాళ‌ కేవ‌లం ముద్దులు, బికినీల కోస‌మే ప‌నికొస్తుందా..?

by Shreyan Ch
February 22, 2023

...

Read moreDetails
politics

YS Sharmila : ష‌ర్మిల లాజిక్ మిస్ అయిందా.. ఆమె అనుకున్న‌ది ఒక్క‌టైతే, జ‌రిగేది మ‌రొక‌టా..!

by Shreyan Ch
January 7, 2024

...

Read moreDetails
వార్త‌లు

Actor Suman : కరుణానిధి, నేను ఒకే జైలులో ఉన్నాం.. ఆ ముగ్గురు ఆడ‌వాళ్లే నాకు  సాయం చేశార‌న్న సుమ‌న్..

by Shreyan Ch
August 2, 2023

...

Read moreDetails
వార్త‌లు

Pushpa : పుష్పలో న‌టించే చాన్స్‌ను మిస్ చేసుకున్న‌.. న‌టీన‌టులు వీరే..!

by Shreyan Ch
September 27, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.