Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home క్రీడ‌లు

Lasith Malinga : ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టులో గొడ‌వ‌లు.. మ‌లింగ‌తోను పాండ్యాకి ప‌డ‌డం లేదా?

Shreyan Ch by Shreyan Ch
April 1, 2024
in క్రీడ‌లు, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Lasith Malinga : ముంబై ఇండియ‌న్స్‌కి కొత్త కెప్టెన్‌గా వ‌చ్చిన హార్ధిక్ పాండ్యా అప్పటి నుండి నిత్యం వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తున్నారు. ఆయ‌న ఏం చేసిన క‌లిసి రావ‌డం లేదు. ఆడిన రెండు మ్యాచ్‌లు ఓడిపోయారు. ఇక అత‌ని ఆట తీరు కూడా ఏ మాత్రం బాగుండ‌డం లేదు. రోహిత్ తో పడటం లేదన్న వార్తలు.. వీటి మధ్య తాజాగా బౌలింగ్ కోచ్ మలింగను పక్కకు తోసేసిన వీడియో కూడా తెరపైకి వచ్చింది. ఛాన్స్ దొర‌కాలే కాని హార్ధిక్ పాండ్యాని నెటిజ‌న్స్ బాగానే ట్రోల్ చేస్తున్నారు. . అతడు ఎక్కడ దొరుకుతాడా అని ఎదురు చూసి మరీ ట్రోల్ చేస్తున్నారు. హార్దిక్ చేసే ప్రతి తప్పును వెతికే పనిలో ఉన్నారు.

సన్ రైజర్స్ చేతుల్లో దారుణమైన ఓటమి తర్వాత ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ లసిత్ మలింగతోనూ అతనికి పడటం లేదన్నట్లుగా ఓ వీడియో తెరపైకి వచ్చింది.మ్యాచ్ ముగిసిన తర్వాత తనను హగ్ చేసుకోవడానికి వచ్చిన మలింగను హార్దిక్ పట్టించుకోకుండా పక్కకు తోసేస్తూ వెళ్లిపోయినట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. దీంతో మలింగ కూడా అతనికి దూరంగా వెళ్లిపోయాడు. ఇక మరో వ్యక్తి షేర్ చేసిన వీడియో చూసినా హార్దిక్, మలింగ మధ్య ఏదో గట్టిగానే నడుస్తోందన్నట్లుగా అనిపిస్తుంది. అందులో బ్యాటింగ్ కు సిద్ధమవుతూ హార్దిక్ ప్యాడ్స్ కట్టుకొని రెడీగా ఉన్నాడు.డగౌట్ లో అతని వెనుక ముంబై ఇండియన్స్ కోచ్ లు మలింగ, పొలార్డ్ కుర్చీలపై కూర్చొని ఉన్నారు.

Lasith Malinga unhappy with mumbai indians team performance
Lasith Malinga

హార్దిక్ ను చూసి పొలార్డ్ లేస్తూ ఇక్కడ కూర్చోవాల్సిందిగా అడిగాడు. కానీ పక్కనే ఉన్న మలింగ అతన్ని వారిస్తూ.. నేను వెళ్లిపోతానంటూ హార్దిక్ కు ముఖం చాటేస్తూ వెళ్లిపోయాడు. ఈ రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ రెండు వీడియోలు చూసిన తర్వాత హార్దిక్ పాండ్యాపై అభిమానులు మరింత మండిపడుతున్నారు. ఇప్పటికే రోహిత్ ను తప్పించి అతనికి కెప్టెన్సీ ఇవ్వడంపై గుర్రుగా ఉన్న వాళ్లకు వరుసగా పాండ్యా చేసే తప్పిదాలు కనిపిస్తున్నాయి.కెప్టెన్ గా హార్దిక్ తీసుకున్నతప్పుడు నిర్ణయాలు, రెండో మ్యాచ్ లో చెత్త బ్యాటింగ్, ఇప్పుడు మలింగతో అనుచిత ప్రవర్తన.. ఇవన్నీ చూసిన ఫ్యాన్స్ హార్దిక్ ను మరింత డిఫెన్స్ లోకి నెట్టేస్తున్నారు. గత రెండు సీజన్లుగా ముంబై ఇండియన్స్ ప్రదర్శన ఆశించిన మేర లేదు. ఈ సీజన్లోనూ వరుసగా రెండు ఓటములతో ప్రారంభించింది.

Tags: Lasith Malinga
Previous Post

Balakrishna : స‌మీర్ అన్న మాట‌ల‌కు బాల‌య్య ఎలా న‌వ్వారో చూడండి..!

Next Post

Anita Hassanandani : ఉద‌య్ కిర‌ణ్ గురించి మాట్లాడుతూ ఎమోష‌న‌ల్ అయిన అనిత‌.. ఏమ‌న్న‌దంటే..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

KGF Garuda : కేజీఎఫ్ మొద‌టి పార్ట్‌లో విల‌న్‌గా గ‌రుడ‌ను అస‌లు ఎలా ఎంపిక చేశారో తెలుసా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

by editor
December 12, 2022

...

Read moreDetails
వార్త‌లు

SS Rajamouli Net Worth : రాజ‌మౌళి ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

by Shreyan Ch
November 19, 2022

...

Read moreDetails
వార్త‌లు

Super Star Krishna Death : క‌న్నుమూసిన కృష్ణ‌.. చివ‌రి రోజుల‌లో మ‌నోవేద‌న చెందారా..?

by Shreyan Ch
November 15, 2022

...

Read moreDetails
వార్త‌లు

త‌న రెండో భార్య‌తో ల‌వ్ ఎలా మొద‌లైందో ఎట్ట‌కేల‌కు చెప్పేసిన దిల్ రాజు

by Shreyan Ch
January 17, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.