Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Nara Bhuvaneshwari : ఏంటి.. వాళ్ల‌ని క‌ల‌వ‌కూడ‌దా.. ఆ ప్ర‌భుత్వానికి హ‌క్కు ఎక్క‌డిది అంటూ భువ‌నేశ్వ‌రి ఫైర్

Shreyan Ch by Shreyan Ch
October 19, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Nara Bhuvaneshwari : చంద్రబాబు అరెస్ట్ అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఒకవైపు చంద్రబాబును జైలు నుంచి విడుదల చేసేందుకు నారా లోకేష్ విశ్వప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమయ్యారు నారా భువనేశ్వరి. ‘నిజం గెలవాలి’ అంటూ యాత్ర చేపట్టబోతున్నారు నారా భువనేశ్వరి. తాజాగా ఏపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు మద్దతుగా, రాజమహేంద్రవరంలో ఉన్న తనను కలిసి మనోధైర్యాన్ని ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంఘీభావ యాత్ర చేపడితే.. అందులో తప్పేంటని ప్రశ్నించారు.

తనకు సంఘీభావం తెలిపేవారికి నోటీసులు ఇవ్వడాన్ని భువ‌నేశ్వ‌రి ట్విట్టర్ వేదికగా తప్పుబట్టారు. భువనేశ్వరిని కలిసేందుకు వెళితే చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. ఈ అంశాన్ని ఆమె ప్రస్తావించారు. పార్టీ కార్యకర్తలు మా బిడ్డల్లాంటి వాళ్లు.. బాధలో ఉన్న అమ్మను కలిస్తే చర్యలు తీసుకుంటామని నోటీసులు ఇస్తారా?నన్ను కలవకూడదని చెప్పడానికి ఈ ప్రభుత్వానికి హక్కు ఎక్కడిది’’ అని ప్రశ్నిస్తూ భువనేశ్వరి ట్వీట్‌ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి అండగా.. రాజమహేంద్రవరంలో ఉన్న నారా భువనేశ్వరికి పార్టీ నేతలు, శ్రేణులు తరలివస్తున్నారు. అయితే రాజమహేంద్రవరం వస్తున్న వారికి నోటీసులు ఇవ్వడాన్ని భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Nara Bhuvaneshwari very angry on ap government
Nara Bhuvaneshwari

ఇక ఇదిలా ఉంటే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ ఈ నెల 19వ తేదీకి వాయిదా పడింది. చంద్రబాబు తరఫు న్యాయవాదుల అభ్యర్థన మేరకు హైకోర్ట్ విచారణను వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై తిరిగి 19న పూర్తి స్థాయిలో వాదనలు చేపట్టే అవకాశం ఉంది. అంతేకాదు ఇవాళ చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పైనా సుప్రీం కోర్టులో విచారణ జరగనున్న సంగతి తెలిసిందే. ఇవాళ ఫైనల్ వాదనలు వినిపించిన తర్వాత కోర్టు నిర్ణయం ఎలా ఉంటుంద‌నే దానిపై అంద‌రిలో ఎంతో ఆస‌క్తి నెల‌కొంది. కాగా, చంద్రబాబు అరెస్టు తర్వాత.. పలువురు టీడీపీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఆ కుటుంబాలను పరామర్శించాలని ఆయన నారా భువనేశ్వరి నిర్ణయించుకున్నారు. ప్రతీ వారం రెండు, మూడు ప్రాంతాలకు వెళ్లి ఇలాంటి కుటుంబాలను పరామర్శించాలని నిర్ణయం తీసుకున్నారు.

Tags: Nara Bhuvaneshwari
Previous Post

Rohit Sharma Mumbai House : ముంబైలో రోహిత్‌కి ఖ‌రీదైన బంగ్లా.. లోప‌ల ఎలా ఉందో చూడండి..!

Next Post

Sreeleela : భ‌గ‌వంత్ కేస‌రి సినిమా చూసేందుకు వెళ్లిన శ్రీలీల‌, బాలయ్య త‌న‌య‌.. ఇబ్బంది పెట్టిన ప్రేక్ష‌కులు

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Pathu Thala : శింబు న‌టించిన ప‌తు త‌లా మూవీ రివ్యూ.. ఓటీటీలో ఉంది..!

by Shreyan Ch
April 29, 2023

...

Read moreDetails
politics

Pawan Kalyan : బ‌ర్రెల‌క్క‌పై దాడి.. నీకోసం నేను అండ‌గా ఉంటానంటూ ధైర్యం ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

by Shreyan Ch
November 24, 2023

...

Read moreDetails
క్రైమ్‌

పేలిన ఏసీ.. త‌ల్లి కూతుళ్లు అక్క‌డికక్క‌డే మృతి..

by Shreyan Ch
October 5, 2023

...

Read moreDetails
politics

Raghurama Krishnam Raju : వివేకా హత్యపై రఘురామ‌కృష్ణంరాజు సంచ‌ల‌న కామెంట్స్.. భార‌తీ రెడ్డి వాట్సాప్ చాట్ బ‌య‌టపెట్టేశాడుగా..!

by Shreyan Ch
July 25, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.