Pawan Kalyan And BJP : తెలంగాణ‌లోనూ బీజేపీకి హ్యాండ్ ఇచ్చిన జ‌న‌సేన‌..? టీడీపీతో క‌లిసే పోటీ..?

Pawan Kalyan And BJP : తెలంగాణలో ఏపాటి బలముందో లేదో తెలియదు గానీ ఈ సారి జనసేన మాత్రం పోటీకు సై అంటుంది. బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకు ఆ పార్టీతో కలిసి పోటీ చేయాలని భావిస్తుంద‌ని కొంద‌రు అంటుండ‌గా , మ‌రి కొంద‌రు మాత్రం బీజేపీకి హ్యాండ్ ఇచ్చి టీడీపీతో క‌లిసి పోతుంద‌ని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో తెలంగాణ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ పార్టీలన్నీ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ప్రధాన పార్టీలతోపాటు.. తెలంగాణ సమరంలో పోటీచేసేందుకు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన కూడా సిద్ధమవుతోంది.

32 స్థానాల్లో పోటీచేయనున్నట్లు తెలంగాణ జనసేన నేతలు ప్రకటించారు. ఈ క్రమంలో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా దూసుకెళ్తున్న బీజేపీ.. ఏపీలోని మిత్ర పార్టీ జనసేనను కలుపుకుని.. ఎన్నికల సంగ్రామంలో తలపడేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేయడంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. అభ్యర్థుల ప్రకటనకు ముందు తెలంగాణలో జనసేనతో ఉమ్మడి పోటీ గురించి బీజేపీ నేతలు బుధవారం ఆపార్టీ అధినేత పవన్ కల్యాణ్ తో చర్చలు జరిపారు. కాని చ‌ర్చ‌ల త‌ర్వాత ప‌వ‌న్ అంత ఆస‌క్తి చూపిన‌ట్టు అనిపించ‌డం లేద‌ని అంటున్నారు. ఏపీలో అధికార పార్టీకి అన్ని విధాలుగా సహాయసహకారాలు అందించి ఆ పార్టీ ద్వారా రాష్ట్రంలో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీని బలహీన పరచాలన్న బీజేపీ వ్యూహం బెడిసికొట్టిందని అంటున్నారు.

Pawan Kalyan And BJP might not contest in telangana jointly
Pawan Kalyan And BJP

ఈ సారి జ‌న‌సేన‌.. బీజేపీతో తెగదెంపులు చేసుకోవడానికైనా రెడీ కానీ పోటీకి దూరంగా ఉండే ప్రశక్తే లేదని బీజేపీకి తేల్చి చెప్పేశారని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఏపీలో తన తీరుతో జనసేనను దూరం చేసుకున్న బీజేపీ తెలంగాణలో కూడా అదే అపరిపక్వ తీరుతో ఆ పార్టీకి దూరం అవుతోందని టాక్ వినిపిస్తుంది. ఈసారి నాయకులు పోటీ కోరుకుంటున్నారనే విషయం బయటకొచ్చింది. దానికి అధినాయకుడు సమాధానం కూడా విచిత్రంగానే ఉంది. పార్టీలో అంతర్గతంగా జరిగిన చర్చను బహిరంగ పరచడం విశేషం అనే చెప్పుకోవాలి. అంతే కాదు.. బీజేపీ, టీడీపీని పరోక్షంగా పవన్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని కూడా అనుకోవచ్చు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

10 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

10 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago