Pawan Kalyan : ఆంధ్రా యాస‌లో జ‌గన్‌కి గ‌ట్టిగా ఇచ్చి ప‌డేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. మామూలు పంచ్‌లు కావు..!

Pawan Kalyan : ఏపీ సీఎం జ‌గ‌న్ చేస్తున్నది దిగజారుడు రాజకీయాలు అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప‌దే ప‌దే చెబుతూ వ‌స్తున్నారు. రాజ‌కీయాల‌లో విలువలు నిలబెట్టేలా తాను వ్యవహరిస్తుంటే అధికార పార్టీ వైసీపీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని, తనను వ్యక్తిగతంగా దూషిస్తూ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇక దిగ‌జారి మాట్లాడుతున్న జ‌గ‌న్‌ని నువ్వు అని ఏకవచనం తోనే పిలుస్తాను అని ఏలూరు స‌భ‌లో చెప్పుకొచ్చారు. మర్యాద పుచ్చుకోలేని వారికి ఇవ్వడమూ అనవసరం అన్నారు పవన్. సీఎం పదవికి జగన్ అనర్హుడు అని, వైసీపీ నేతల అన్యాయం, దుర్మార్గాలపై ప్రశ్నిస్తున్నానన్న కోపంతోనే తనను పెళ్లిళ్లు అని, లేక ఇంట్లో ఆడవారిపై వ్యాఖ్యలు చేస్తూ వ్యక్తితంగా దాడి చేయించడం అందుకు నిదర్శనం అన్నారు.

ఇక తాడేప‌ల్లి గూడెం స‌భ‌లో ప్ర‌తి ఒక్క‌రికి న‌మ‌స్కారాలు తెలియ‌జేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. జ‌గ‌న్‌కి కూడా విష్ చేస్తూ నేను ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడిని అంటూ ఆంధ్రా యాస‌లో చెప్పుకొచ్చారు. ఇక తాను రాజకీయాల్లోకి ఎంతో ఇష్టంగా వచ్చానని..జగన్ మద్దతుదారులు నీచంగా మాట్లాడుతున్నారని పవన్ అన్నారు. కొంతకాలంగా జగన్ కూడా దిగజారి మాట్లాడుతున్నారని పవన్ ఆరోపించారు. తనకు వాలంటీర్లంటే కోపం లేదని..ఈ వాలంటీర్ వ్యవస్థకు అధిపతి ఎవరని పవన్ ప్రశ్నించారు. వాలంటీర్లు చేసే అరాచకాలకు ఎవరు బాధ్యత వహిస్తారని పవన్ నిలదీశారు.

Pawan Kalyan imitated cm ys jagan in andhra yasa
Pawan Kalyan

బూమ్ బూమ్ బీర్ కంటే వాలంటీర్ల రోజు వారి జీతం చాలా తక్కువని అన్నారు. ఏపీలో మద్యం కంటే వాలంటీర్ల జీతాలే తక్కువని పవన్ అన్నారు. తాను ఏనాడూ సీఎం జగన్ ను, జగన్ సతీమణి భారతిని ఒక్క మాట కూడా అనలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కేవ‌లం మేము పాల‌సీల మీద‌నే మాట్లాడ‌మ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఇక తానంటే ముస్లింలకు చాలా ఇష్టమని..కాకపోతే బీజేపీ వెంట ఉండడంతో తనను ముస్లింలు నమ్మడం లేదని పవన్ పేర్కొన్నారు. మొత్తానికి తాడేప‌ల్లి గూడెంలో ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయాల‌లో కాస్త హ‌ట్ టాపిక్‌గా మారాయి.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

9 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

9 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago