Pawan Kalyan : నీకు రాయి త‌గిలితే మా అన్న ఎందుకు స్పందించాలి.. జ‌గ‌న్‌పై ప‌వ‌న్ తీవ్ర వ్యాఖ్య‌లు..

Pawan Kalyan : ఏపీలో రాజ‌కీయం మ‌రింత రంజుగా మారుతుంది. ఒకరిపై ఒక‌రు దారుణ‌మైన వ్యాఖ్య‌లు చేసుకుంటున్నారు. ఇటీవ‌ల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. దత్తపుత్రుడు, నాలుగు పెళ్లిళ్లు అంటూ వైఎస్ జగన్.. పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడుతున్నారు. ఇక పిఠాపురంలో జరిగిన మేమంతా సిద్ధం సభలో అయితే తీవ్రస్థాయిలో విమర్ళలు చేశారు. పవన్ కళ్యాణ్‌కు జ్వరమొస్తే హైదరాబాద్ పారిపోతారని.. ఇలాంటి సినిమా హీరో కావాలో.. జనం కోసం పనిచేసే గీత లాంటి లోకల్ హీరోలు కావాలో తేల్చుకోవాలంటూ సెటైర్స్ వేశారు.. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ వ్యాఖ్యలకు కౌంటర్లు ఇచ్చారు పవన్ కళ్యాణ్. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పవన్.. జగన్ మీద తీవ్రవ్యాఖ్యలు చేశారు.

సినిమా హీరోలంటే వైఎస్ జగన్‌కు కుళ్లు అని పవన్ కళ్యాణ్ విమర్శించారు. లక్షలాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సినిమా హీరోలంటే కుళ్లుతోనే ఇంటి వద్ద వారిని అవమానించారని ఆరోపించారు. టికెట్ల విషయంపై మాట్లాడేందుకు చిరంజీవి, ప్రభాస్, మషేష్ బాబు, రాజమౌళి వంటి సినిమా పెద్దలు గతంలో ఒకసారి వైఎస్ జగన్ ఇంటికి వెళ్లారు. అయితే ఈ సమయంలో జగన్ వారిని అవమానించారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు ఇంటికి వస్తే.. ఇంటి బయటో ఎక్కడో వాహనాలను నిలిపివేయించి.. వారిని నడిపించారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇక ప్రైవేట్ మీటింగ్ జరుగుతుంటే సీక్రెట్ కెమెరాలు, మైకులు ఏర్పాటు చేశారని.. సినీ పరిశ్రమ తరుపున‌ చిరంజీవి మాట్లాడిన వీడియోలను రిలీజ్ చేసి ఆయనను అగౌరపరిచారన్నారు.

Pawan Kalyan sensational comments on cm ys jagan about stone
Pawan Kalyan

లక్షల మంది అభిమానులు తమ గుండెల్లో పెట్టుకునే హీరోలంటే జగన్‌కు కుళ్లు అని అందుకే ఇలా చేశారని పవన్ విమర్శించారు. ఎవరి జోలికి వెళ్లని అజాత శత్రువులాంటి చిరంజీవిని అవమానించిన వ్యక్తి జగన్ అని చెప్పిన పవన్.. ఈ విషయాన్ని అందరు హీరోల ఫ్యాన్స్ గుర్తు పెట్టుకోవాలని సూచించారు. జ‌గ‌న్‌కి మేము వ‌చ్చాక అస‌లు ఏంటో చూపిస్తాం. ఇక్క‌డ చాలా మంది హీరోల అభిమానులు ఉన్నారు. తెలుగుదేశం వాళ్లు న‌న్ను ఎప్పుడు అవ‌మానించ‌లేదు. చిరంజీవి, ప్ర‌భాస్, మ‌హేష్‌ని న‌డిపించి వారిని ఎంత అవ‌మానించారో చూశాం. జ‌గ‌న్ క‌క్ష పూరితమైన వ్య‌క్తి.. అలాంటి వ్య‌క్తిని ఏం చేయాలో తెలియ‌డం లేదు. చిరంజీవి గారు అంద‌రి త‌ర‌పున మాట్లాడితే ఆయ‌నని కూడా అగౌర‌వ‌ప‌రిచారు అంటూ జ‌గ‌న్‌పై ప‌వ‌న్ ఫైర్ అయ్యారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

9 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

9 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago