Pawan Kalyan : పేర్ని నానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ప‌వ‌న్‌..!

Pawan Kalyan : ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ నాలుగో విడ‌త వారాహి యాత్ర చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ వారాహి యాత్ర‌లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేస్తూ వార్త‌ల‌లో నిలుస్తున్నారు. జగన్ నువ్వు ఎవరితో అయినా పెట్టుకో, నేను మాములు వ్యక్తిని కాదు… మీలాంటి గుండాలకు కిరాయి రౌడీలకు భయపడీపోవడానికి నేను సదా సీదా మనిషిని కాదు దేశభక్తుడిని.. నా లాంటి దేశభక్తులతో పెట్టుకుంటే తొక్కి నారా తీస్తాం అంటూ సీఎం జగన్‌కు పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు.బుధవారం కృష్ణా జిల్లా పెడనలో పర్యటించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

వైసీపీపై తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉందని.. రాబోయే ఎన్నికల్లో సత్తా చూపాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైసీపీ పథకాల్లో అంతా డొల్లతనమేనని.. అబద్దాలు చెబుతున్నారంటూ ఆరోపించారు. రాబోయేది జనసేన – టీడీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారాయన. జగన్‌ను గద్దె దించడానికి ఉమ్మడిపోరాటం అవసరమని, కేసులకు భయపడబోనని పవన్‌ చెప్పారు. ప్రజలను కులాలుగా విడదీసి తాను రాజకీయాలు చేయబోనని, కులాలకు, మతాలకు అతీతంగా ప్రజలందరీనీ సమానంగా చూస్తానన్నారు. ఏపీలో కుల భావన ఎక్కువ, ఒక్కటే అనే జాతి భావన తక్కువని చెప్పారు. యువత కులాలకు అతీతంగా ఆలోచించాలని, ఏపీ ప్రయోజనాల కోసం అంతా ఒక్కటి కావాలని ఆయన పిలుపునిచ్చారు.

Pawan Kalyan strong warning to perni nani
Pawan Kalyan

అత్య‌ధిక ఇర్‌రెగ్యూలారిటీ ఉన్న రాష్ట్రంగా ఏపీ నిలిచింది. శ్రామికుల‌కి అండగా నిలిచేలా జ‌గ‌న్ మాట్లాడ‌తాడు. కాని ఆయ‌న వారి పొట్ట‌కొడుతున్నాడు. ఇది నేను చెప్పేది కాదు. పార్ల‌మెంట్‌లో సాధ్వి నిరంజ‌న్ చెప్పింది. వైసీపీ నాయ‌కులు టీవీలలో చూసుకుంటూ చేతులు పిసుక్కుంటూ కూర్చుంటారు క‌దా మేం మాట్లాడుతుంటే, ఇప్పుడు వీటికి ఏం చెబుతారు అని హెచ్చ‌రించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఇన్‌డైరెక్ట్‌గా జ‌గ‌న్‌తో పాటు పేర్ని నానికి ప‌వ‌న్ వార్నింగ్ ఇచ్చాడ‌ని సమాచారం.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 year ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 year ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 year ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 year ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 year ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 year ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 year ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 year ago