Pawan Kalyan : ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వారాహి యాత్రలో జగన్ ప్రభుత్వం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలుస్తున్నారు. జగన్ నువ్వు ఎవరితో అయినా పెట్టుకో, నేను మాములు వ్యక్తిని కాదు… మీలాంటి గుండాలకు కిరాయి రౌడీలకు భయపడీపోవడానికి నేను సదా సీదా మనిషిని కాదు దేశభక్తుడిని.. నా లాంటి దేశభక్తులతో పెట్టుకుంటే తొక్కి నారా తీస్తాం అంటూ సీఎం జగన్‌కు పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు.బుధవారం కృష్ణా జిల్లా పెడనలో పర్యటించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
వైసీపీపై తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉందని.. రాబోయే ఎన్నికల్లో సత్తా చూపాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైసీపీ పథకాల్లో అంతా డొల్లతనమేనని.. అబద్దాలు చెబుతున్నారంటూ ఆరోపించారు. రాబోయేది జనసేన – టీడీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారాయన. జగన్‌ను గద్దె దించడానికి ఉమ్మడిపోరాటం అవసరమని, కేసులకు భయపడబోనని పవన్ చెప్పారు. ప్రజలను కులాలుగా విడదీసి తాను రాజకీయాలు చేయబోనని, కులాలకు, మతాలకు అతీతంగా ప్రజలందరీనీ సమానంగా చూస్తానన్నారు. ఏపీలో కుల భావన ఎక్కువ, ఒక్కటే అనే జాతి భావన తక్కువని చెప్పారు. యువత కులాలకు అతీతంగా ఆలోచించాలని, ఏపీ ప్రయోజనాల కోసం అంతా ఒక్కటి కావాలని ఆయన పిలుపునిచ్చారు.

అత్యధిక ఇర్‌రెగ్యూలారిటీ ఉన్న రాష్ట్రంగా ఏపీ నిలిచింది. శ్రామికులకి అండగా నిలిచేలా జగన్ మాట్లాడతాడు. కాని ఆయన వారి పొట్టకొడుతున్నాడు. ఇది నేను చెప్పేది కాదు. పార్లమెంట్‌లో సాధ్వి నిరంజన్ చెప్పింది. వైసీపీ నాయకులు టీవీలలో చూసుకుంటూ చేతులు పిసుక్కుంటూ కూర్చుంటారు కదా మేం మాట్లాడుతుంటే, ఇప్పుడు వీటికి ఏం చెబుతారు అని హెచ్చరించారు పవన్ కళ్యాణ్. ఇన్‌డైరెక్ట్‌గా జగన్‌తో పాటు పేర్ని నానికి పవన్ వార్నింగ్ ఇచ్చాడని సమాచారం.
 
			 
			






