Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Rashmika Mandanna : టీవీ యాంక‌ర్‌తో ర‌ష్మిక న‌టిస్తుందా..?

Shreyan Ch by Shreyan Ch
May 20, 2024
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Rashmika Mandanna : కూర్గ్ భామ ర‌ష్మిక గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు.ఈ భామ ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా స‌త్తా చాటుతుంది. చలో, భీష్మ, గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరు, పుష్ప సినిమాలతో అగ్ర కథానాయికగా మారారు. బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చి యానియల్‌తో అక్కడా మంచి పేరు తెచ్చుకుంది. కండలవీరుడు సల్మాన్ ఖాన్ – ఏఆర్ మురగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సికిందర్‌లోనూ హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసి లక్కీగాళ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక‌వైపు సినిమాలు, మరోవైపు ప్ర‌క‌ట‌న‌ల‌లో న‌టిస్తూ రెండు చేతులా బాగానే సంపాదిస్తుంది. దీపం ఉండగానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాల‌నే ఆలోచ‌న‌లో ర‌ష్మిక ఉంది.

అయితే ఈ అమ్మడు ఇప్పుడు యాంక‌ర్ తో రొమాన్స్ చేసేందుకు సిద్ధంగా ఉంద‌ట‌. తమిళ టీవీ యాంకర్‌ గా కెరీర్ మొద‌లు పెట్టి అటు నుంచి వచ్చిన గుర్తింపు మరియు క్రేజ్ తో కోలీవుడ్‌ లో అడుగు పెట్టి స్టార్‌ గా ఎదిగిన నటుడు శివ కార్తికేయన్ చిత్రంలో ర‌ష్మిక క‌థానాయిక‌గా ఎంపికైంది. శివ కార్తికేయన్‌ తన తదుపరి సినిమాను సిబి చక్రవర్తి దర్శకత్వంలో చేసేందుకు సిద్ధం కాగా, ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. స్క్రిప్ట్‌ వర్క్ దాదాపుగా పూర్తి అవ్వగా హీరోయిన్‌ ఎంపిక కు చర్చలు జరిగాయట. ర‌ష్మిక‌ని మేక‌ర్స్ సంప్ర‌దించార‌ట‌. తెలుగు మరియు హిందీ సినిమాల్లో వరుసగా నటిస్తున్న రష్మిక మందన్నా ఇప్పటికే ధనుష్ తో నటిస్తుంది. తాజాగా శివ కార్తికేయన్‌ తో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందట.

Rashmika Mandanna reportedly acting with shiva karthikeyan
Rashmika Mandanna

కమర్షియల్‌ సినిమాలు చేస్తూ మంచి విజ‌యాలు సాధిస్తున్న శివ కార్తికేయన్‌ కి రష్మిక తో రొమాన్స్ కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరిద్ద‌రి కాంబోలో సినిమా వ‌స్తే అది మంచి విజ‌యం సాధించ‌డం ఖాయం అంటున్నారు. శివ కార్తికేయన్ హీరోగా జాతిరత్నాలు సినిమా డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ఇంకా పూర్తి క్లారిటీ లేదు. ఇక ర‌ష్మిక పుష్ప‌2లో చేస్తుండ‌గా, ప‌లు హిందీ సినిమాల‌ని కూడా లైన్‌లో పెట్టిన‌ట్టు స‌మాచారం.

Tags: Rashmika Mandanna
Previous Post

Pothina Mahesh : మెగా ఫ్యామిలీపై పోతిన మ‌హేష్ సంచ‌ల‌న కామెంట్స్‌..!

Next Post

Anasuya : సందీప్ రెడ్డి వంగాని మ‌ళ్లీ గెలికిన అన‌సూయ‌.. ఈసారి మ‌రింత ఘాటుగా కౌంట‌ర్‌..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

No Content Available

POPULAR POSTS

No Content Available

    © 2022. All Rights Reserved. Telugu News 365.

    No Result
    View All Result
    • వార్త‌లు
    • ఆరోగ్యం
    • ఆహారం
    • టెక్నాల‌జీ
    • వినోదం
    • ఫీచ‌ర్డ్‌
    • రాజ‌కీయాలు
    • ప్ర‌త్యేక ఆస‌క్తి
    • వీడియోలు
    • వైర‌ల్‌
    • క్రీడ‌లు
    • క్రైమ్‌
    • బిజినెస్

    © 2022. All Rights Reserved. Telugu News 365.