Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home క్రీడ‌లు

Sania Mirza : షోయ‌బ్ మాలిక్‌తో విడాకులు.. సానియా మీర్జా సంచ‌ల‌న పోస్ట్‌..!

Shreyan Ch by Shreyan Ch
January 21, 2024
in క్రీడ‌లు, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Sania Mirza : భారత్‌ – పాకిస్తాన్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం.. సరిహద్దుల్లో నిత్యం కల్లోలాలు.. ఇక ఇరు దేశాల మధ్య క్రికెట్‌, హాకీ, కబడ్డీతో పాటు ఏ క్రీడ అయినా అదొక టగ్‌ ఆఫ్‌ వార్‌గా న‌డుస్తుంది. అయితే ఇంత క్లిష్ట‌మైన స‌మ‌యంలో సానియా మీర్జా – షోయబ్‌ మాలిక్‌లు వివాహబంధంతో కలవడం అనేది కచ్చితంగా ఆశ్చర్యం కలిగించేదే. ప్రేమకు సరిహద్దులతో సంబంధం లేదని, మనసులు కలిస్తే మనుషులను గెలవడం అంత కష్టమేమీ కాదని నమ్మిన ఆ జంట.. పుష్కరకాలం కూడా కలిసుండలేకపోయింది. సానియా మీర్జాను షోయబ్ మాలిక్ 2010లో ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటికీ మాలిక్‌కు రెండో వివాహం. తన తొలి భార్య అయేషా సిద్ధిఖితో విడాకుల అనంతరం సానియాను పెళ్లి చేసుకున్నాడు. అయితే తాజాగా పాకిస్థాన్ ప్రముఖ నటి సనా జావేద్‌ను మాలిక్ వివాహమాడాడు. ఈ కొత్త జంటకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో ట్రెండింగ్ మారాయి.

సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడిపోతున్నట్లుగా గత కొన్నిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వారి మధ్య మనస్పర్థలు వచ్చినట్లు రెండేళ్ల క్రితమే వార్తలు మొదలయ్యాయి. విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రచారం కూడా జోరుగా సాగింది. కానీ ఆ తర్వాత ఆ వార్తలకు బ్రేక్ పడింది. అయితే తాజాగా సానియా మీర్జా చేసిన పోస్ట్‌తో మరోసారి విడిపోతున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ‘పెళ్లి కష్టం, విడాకులు కష్టమే. మీరు కఠినంగా ఉండి, సరైన దాన్ని ఎంచుకోండి. మనం ఎప్పుడూ మన కష్టాన్నే నమ్ముకోవాలి’ అంటూ సానియా ఓ కొటేషన్‌ను తన పోస్ట్‌లో రాసుకొచ్చింది.

Sania Mirza sensational post after divorce with shoaib malik
Sania Mirza

గ‌త కొద్ది రోజులుగా జ‌రుగుతున్న ప్రచారానికి తగ్గట్లుగానే తాజాగా తాను రెండో పెళ్లి చేసుకున్న ఫొటోలను షోయబ్ మాలిక్ సోషల్ మీడియాలో షేర్ చేయడం సంచలనం రేపింది. పాకిస్థాన్ నటి సనా జావెద్ ను తాను పెళ్లి చేసుకున్నట్టు షోయబ్ మాలిక్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టి అఫీషియల్ గా ప్రకటించాడు. సనాను పెళ్లి చేసుకున్న ఫొటోలను షేర్ చేశాడు. పెళ్లి దుస్తుల్లో ఉన్న కొత్త జంట ఫొటోలు చూసి సానియా, షోయబ్ విడాకులు తీసుకున్న సంగతి నిజమేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొద్ది రోజులుగా సానియా సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టుు చూసి చాలామంది వారు విడిపోయారని నిర్ధారణకు వచ్చారు.ఇక సనా విష‌యానికి వ‌స్తే ఆమె వ‌య‌స్సు 28 ఏళ్లు. అనేక టీవీ షోల్లో క‌నిపించింది. ‘ఏ ముష్త్‌-ఎ-ఖాన్‌’, ‘డంక్’ అనే షోలతో ఆమెకు గుర్తింపు లభించింది. అయితే 2020లో ఉమైర్ జ‌స్వాల్‌ను ఆమె వివాహం చేసుకుంది. కానీ కొద్దికాలానికే ఈ దంప‌తుల మ‌ధ్య విభేదాలు రావ‌డంతో విడిపోయారు.

Tags: sania mirza
Previous Post

Prabhas : ఆ రోజు అయోధ్య‌లో భోజ‌న ఖ‌ర్చు అంతా ప్ర‌భాస్‌దేన‌ట‌..!

Next Post

Ramya Krishnan : మ‌హేష్ బాబుతో అప్పుడు ప్రేయ‌సిగా, ఇప్పుడు త‌ల్లిగా న‌టించిన ర‌మ్య‌కృష్ణ‌.. ఏందిది..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

KGF Garuda : కేజీఎఫ్ మొద‌టి పార్ట్‌లో విల‌న్‌గా గ‌రుడ‌ను అస‌లు ఎలా ఎంపిక చేశారో తెలుసా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

by editor
December 12, 2022

...

Read moreDetails
వార్త‌లు

Godfather Event : వామ్మో.. దొంగ‌ల చేతి వాటం మామూలుగా లేదు.. గాడ్ ఫాద‌ర్ ఈవెంట్‌లో 300 సెల్ ఫోన్స్ చోరీ..

by Shreyan Ch
September 30, 2022

...

Read moreDetails
వార్త‌లు

Sitara Ghattamaneni : మ‌హేష్ కుమార్తె సితార‌కు ఇష్ట‌మైన హీరోయిన్ ఎవ‌రో తెలుసా..?

by Shreyan Ch
September 7, 2022

...

Read moreDetails
వార్త‌లు

Sreeja Konidela : ఈ ఒక్క పోస్ట్ తో విడాకుల విష‌యం క‌న్‌ఫాం చేసిన చిరంజీవి చిన్నల్లుడు..!

by Shreyan Ch
November 11, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.