Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Shriya Saran : ప్రెగ్నెన్సీ మేట‌ర్ దాచ‌డంపై ఎట్ట‌కేల‌కు ఓపెన్ అయిన శ్రియ‌

Shreyan Ch by Shreyan Ch
December 16, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Shriya Saran : ఒక‌ప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా స‌త్తా చాటిన అందాల ముద్దుగుమ్మ శ్రియ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తుంది. అప్ప‌ట్లో శ్రియ టాప్ హీరోల అంద‌రితో క‌లిసి ప‌ని చేసింది. ఇక ఇప్పుడు కూడా తెలుగులో శ్రియ అడపాదడపా చిత్రాలు చేస్తున్నారు.అయితే ఆమెకు బాలీవుడ్ లో వయసుకు తగ్గ పాత్రలు రావడం విశేషం. సీనియర్ స్టార్స్ పక్కన ఆమెకు ఆఫర్స్ దక్కుతున్నాయి. ఆర్ ఆర్ ఆర్ మూవీలో శ్రియా నటుడు అజయ్ దేవ్ గణ్ భార్యగా తళుక్కున మెరిసి అల‌రించింది. ఒక ప్రక్క హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనుభవిస్తూ మరో ప్రక్క చక్కగా సినిమాలు చేస్తుంది శ్రియ. అటు పర్సనల్ లైఫ్ ఇటు ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలన్స్ చేస్తూ ముందుకు సాగుతుంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రియ తన కెరీర్ గురించే కాకుండా ప్రగ్నెన్సీని దాచడానికి గల కారణాన్ని కూడా వెల్లడించింది. రష్యాకి చెందిన ఆండ్రీ కొచ్చీవ్‌తో 2018, మార్చి 19న శ్రియ వివాహం కాగా, ఆ ఏడాది తర్వాత ఆమె ప్రగ్నెంట్ అయింది. ఆ విషయం మాత్రం మీడియాకి తెలియకుండా జాగ్రత్తపడింది. అలా అని సినిమాలకి ఏమీ దూరంగా లేదు. ప్రగ్నెంట్‌గా ఉన్న సమయంలోనూ షూటింగ్‌కి హాజరైనట్లు శ్రియ చెప్పుకొచ్చింది. ఈ ఏడాది విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో కూడా శ్రియ నటించింది. అయితే ప్రగ్నెన్సీ విషయం ఎందుకు దాచాల్సి వచ్చింది అనే దానిపై స్పందించిన శ్రియ‌..‘‘ఒక నటిగా ఆ విషయం చెప్పేందుకు చాలా భయపడ్డాను. ఒకవేళ మీడియాకి తెలిస్తే? ఆ మ‌ధుర‌ క్షణాల్ని అనుభవించలేమో అని కంగారుపడ్డాను.

Shriya Saran finally revealed important facts about her pregnancy
Shriya Saran

ప్రగ్నెన్సీ కారణంగా కొంత‌ లావు అయ్యాను. అలానే శరీరంలో కూడా మార్పులు వచ్చాయి. దాంతో మీడియాతో పాటు సోషల్ మీడియాలో ఏం రాస్తారో అనే భయం నాలో కలిగింది. అలానే ఒకసారి నేను ప్రగ్నెంట్ అని తెలిసిన తర్వాత మళ్లీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వాలంటే చాలా సమయం పడుతుంది. అప్పటికే నా చేతిలో మూడు సినిమాలు ఉండ‌గా, ఆ విషయం ఎవరికీ చెప్పకుండా ఆ సినిమాల్లో నటించాను. కానీ నెలలు పెరిగే కొద్దీ సినిమాలకి దూరంగా ఉన్నాను అని శ్రియ చెప్పుకొచ్చింది. అయితే ఇటీవ‌ల శ్రియ త‌న కూతురితో క‌లిసి తెగ సంద‌డి చేస్తుంది.

Tags: cinema newsShriya SaranTollywood
Previous Post

Upasana : అత్తారింటి నుండి పుట్టింటికి వెళ్లిన ఉపాస‌న.. ఎందుకో తెలుసా..?

Next Post

Manchu Lakshmi : జీవితంలో స‌రిదిద్దుకోలేని తప్పు చేశానంటూ మంచు ల‌క్ష్మీ కామెంట్స్

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Sajjala Ramakrishna Reddy : చంద్ర‌బాబుతో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ పొత్తు.. షాకింగ్ కామెంట్స్ చేసిన‌ స‌జ్జ‌ల‌..

by Shreyan Ch
September 15, 2023

...

Read moreDetails
వార్త‌లు

Brahmanandam : బ్ర‌హ్మానందం నాన్‌స్టాప్ పంచ్‌లు.. బొమ్మ‌తో సంసారం ఏంటని కామెడీ..!

by Shreyan Ch
October 12, 2023

...

Read moreDetails
వార్త‌లు

Dasara Movie : ద‌స‌రా మూవీకి సిల్క్ స్మిత‌కి ఉన్న రిలేష‌న్ ఏంటి.. ఇది తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

by Shreyan Ch
March 29, 2023

...

Read moreDetails
వార్త‌లు

Mahesh Babu : మ‌హేష్ ఖాతాలో మ‌రో ఫ్లాప్ అనుకున్నారు.. కానీ త‌ర్వాత బ్లాక్ బ‌స్ట‌ర్..

by Shreyan Ch
May 15, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.