Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Sonia Gandhi : రేవంత్ రెడ్డి మ‌న‌వ‌డితో ఆట‌లాడుకున్న సోనియా గాంధీ.. ఆశీస్సులు అందించిన రాహుల్..

Shreyan Ch by Shreyan Ch
December 8, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Sonia Gandhi : ఈ రోజు తెలంగాణ కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి ప్ర‌మాణ స్వీకారం చేయ‌గా, ఆయ‌న‌తో పాటు 11 మంది మంత్రులు కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ స‌మ‌క్షంలో ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. ఇక రేవంత్ రెడ్డి ముందుగా ప్ర‌మాణ స్వీకారం చేసి ఆ త‌ర్వాత త‌న‌దైన శైలిలో స్పీచ్ ఇచ్చారు. ప్రగతి భవన్‌ ఇకపై ప్రజాభవన్‌గా మారబోతోందని.. అక్కడ ప్రజాదర్బార్ నిర్వహిస్తామని అన్నారు. ఆరు గ్యారంటీల విషయంలోనూ మాట నిలుపుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో ప్రజాప్రభుత్వం కొలువుదీరిందన్నారు.

బానిసత్వపు సంకెళ్లు బద్దలయ్యాయని పేర్కొన్న రేవంత్.. ఇక తెలంగాణ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుందన్నారు. సామాజిక న్యాయం, సమాన అభివృద్ధితో, తెలంగాణ ఉజ్వలంగా వెలుగుతుందన్నారు. పేదల ముఖాల్లో వెలుగులు వెల్లివిరుస్తాయని, హక్కుల రెక్కలు విచ్చుకుంటాయన్నారు. త్వరలోనే తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. అయితే ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే.. రేవంత్ రెడ్డి తన సతీమణి గీతతో కలిసి సోనియా ఆశీర్వాదం తీసుకున్నారు. సోనియగాంధీ కాళ్లు మొక్కారు రేవంత్ దంపతులు.

Sonia Gandhi attended in revanth reddy cm oath ceremony
Sonia Gandhi

రేవంత్ త‌న కూతురు అల్లుడిని కూడా పిలిచారు. వారిని సోనియా,రాహుల్‌ల‌కి ప‌రిచ‌యం చేశారు. అయితే సోనియా వేదికపైకి వ‌చ్చిన‌ప్పుడు రేవంత్ మ‌న‌వ‌డిని ముద్దాడింది. ఆ త‌ర్వాత రాహుల్ గాంధీ కూడా బాబు క్యూట్‌గా ఉన్నాడంటూ కామెంట్ చేసి ఆశీస్సులు అందించారు. ప్ర‌స్తుతం ఈ విజువల్స్ వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డితోపాటూ.. మరో 11 మంది కూడా ప్రమాణం చేశారు. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోద రాజనర్సింహ ప్రమాణ స్వీకారం చేశారు.

Tags: Sonia Gandhi
Previous Post

Seethakka : సీతక్క క్రేజ్ చూసి షాకైన సోనియా.. గ‌వ‌ర్న‌ర్ కూడా ఒకింత ఆశ్చ‌ర్యం..

Next Post

Revanth Reddy : రేవంత్ రెడ్డి ప్ర‌మాణ స్వీకారం.. ద‌ద్ద‌రిల్లిన ఎల్బీ స్టేడియం..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

బిజినెస్

IT Employees : ఐటీ రంగంలో తీవ్ర సంక్షోభం.. క‌ష్ట‌కాలం మొద‌లైన‌ట్టేనా..?

by Shreyan Ch
November 8, 2023

...

Read moreDetails
బిజినెస్

New House : మీరు ఇల్లు కొంటున్నారా.. కేంద్ర ప్ర‌భుత్వం స్కీం గురించి తెలుసుకోవ‌ల్సిందే..!

by Shreyan Ch
November 3, 2023

...

Read moreDetails
టెక్నాల‌జీ

ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన టెక్నో స్పార్క్ 9టి స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర ఎంతంటే..?

by editor
July 28, 2022

...

Read moreDetails
బిజినెస్

Okaya Freedom LI 2 : ఈ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌పై ఏకంగా రూ.17వేలు త‌గ్గింపు..!

by Shreyan Ch
July 26, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.