Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Sreeleela : వారెవ్వా శ్రీ‌లీల‌.. నిజంగా ఇది ప్ర‌పంచ రికార్డే..!

Shreyan Ch by Shreyan Ch
May 16, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Sreeleela : తెలుగ‌మ్మాయిల‌కి సినిమా అవ‌కాశాలు పెద్ద‌గా రావ‌ని కొంద‌రు విమ‌ర్శ‌లు చేస్తుంటారు. కాని అవ‌న్నీ అవాస్త‌వాలు. టాలెంట్ ఉంటే మంచి ఛాన్స్ లు వ‌స్తాయ‌ని నిరూపిస్తుంది శ్రీలీల‌. వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది శ్రీ లీల. కన్నడలో కొన్ని సినిమాలు చేసిన ఆమె తెలుగులో పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్గా లాంచ్ అయింది. శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా శ్రీ లీల హీరోయిన్గా ఈ సినిమాని గౌరీ రోనంకి ఈ సినిమా తెర‌కెక్కించ‌గా, ఈ చిత్రం హిట్ కావ‌డంతో శ్రీ లీల వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఈ సినిమా తర్వాత శ్రీ లీల ధమాకా సినిమాలో ర‌వితేజ స‌ర‌స‌న న‌టించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఇక ఆ సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో ఈ భామకు ఆఫ‌ర్ల వెల్లువ వెల్లువెత్తుతుంది.

శ్రీలీల ఖాతాలో ప్ర‌స్తుతం 9 సినిమాలు ఉన్న‌ట్టు తెలుస్తుంది. ఇది ప్ర‌పంచ రికార్డ్ అని అంటున్నారు. అతి చిన్న వయసులోను, అది కాకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే 9 భారీ బడ్జెట్ చిత్రాలలో అవకాశాలు దక్కించుకోవడం నిజంగా అరుదైన ఘటన అని చెప్పవచ్చు. ప్ర‌స్తుతం విజయ్ దేవరకొండ 12వ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందబోతోంది. మరోపక్క నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 108వ సినిమాలో కూడా ఆమె కీలక పాత్రలో నటిస్తోంది హీరోయిన్ పాత్ర కాకపోయినా బాలకృష్ణ కుమార్తె పాత్ర అనే ప్రచారం అయితే ముందు నుంచి జరుగుతోంది.

Sreeleela great world record about movies
Sreeleela

పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్లో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. అలాగే మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు 28వ సినిమాలో కూడా శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. అలానే రామ్ పోతినేని బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాలో కూడా ఈ బామ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇవి కాకుండా నితిన్ హీరోగా నటిస్తున్న 32వ సినిమా, పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఆది కేశవ సినిమా ప్రాజెక్టుల్లో కూడా ఈ భామ భాగం అవుతుంది. నవీన్ పోలిశెట్టి హీరోగా వస్తున్న సినిమాలో కూడా శ్రీ లీల హీరోయిన్గా ఎంపికైంది. క‌న్న‌డ సినిమాలోను ఈ భామ ఎంపికైన‌ట్టు తెలుస్తుంది. ఇలా ఏకంగా తొమ్మిది సినిమాలు చేస్తున్న ఈ భామ ఇప్పుడు గంటల్లో లెక్క రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది.

Tags: Sreeleela
Previous Post

Taraka Ratna Wife Alekhya : తార‌క‌ర‌త్న చివ‌రి కోరిక‌.. త‌ప్ప‌క తీరుస్తానంటున్న భార్య అలేఖ్య‌..!

Next Post

IPL గురించి ఎవ‌రూ చెప్పని చీకటి నిజాలు ఇవి.. మీకు తెలుసా..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Colors Swathi : అంద‌రి ముందే సాయిధ‌ర‌మ్ తేజ్‌కి ముద్దు పెట్టిన స్వాతి..!

by Shreyan Ch
September 27, 2023

...

Read moreDetails
వార్త‌లు

Sreeja Kalyan Dhev : శ్రీజ‌, క‌ళ్యాణ్ దేవ్ విడిపోయారా.. విడాకుల‌పై జ‌రుగుతున్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌..

by Shreyan Ch
December 20, 2022

...

Read moreDetails
special interest

Keys Tag : తాళం చెవుల‌కు ఉండే ట్యాగ్‌పై నంబ‌ర్ ఉంటుంది క‌దా.. అదేమిటో తెలుసా..?

by editor
October 5, 2022

...

Read moreDetails
క్రీడ‌లు

Team India : వ‌రుస ఓట‌ముల‌తో టీమిండియాలో క‌ల‌వ‌రం.. క‌ల‌సిరాని 2022..

by Shreyan Ch
December 5, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.