Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Revanth Reddy : రేవంత్ రెడ్డి ప్ర‌మాణ స్వీకారం.. ద‌ద్ద‌రిల్లిన ఎల్బీ స్టేడియం..

Shreyan Ch by Shreyan Ch
December 8, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Revanth Reddy : తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత తొలి ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ చరిత్ర తిర‌గ‌రాస్తే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి నిలిచారు. ఈ రోజు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో రేవంత్‌తో గవర్నర్‌ తమిళిసై ప్రమాణం చేయించారు. అనంతరం పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లి గుడికి కుటుంబ సమేతంగా వెళ్లిన రేవంత్‌ రెడ్డి.. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎల్బీ స్టేడియానికి చేరుకున్నారు. మర్గమధ్యలో గన్‌పార్క్‌ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు.

అయితే రేవంత్ ప్ర‌మాణ స్వీకారం స‌మ‌యంలో రేవంత్ రెడ్డి అను నేను తెలంగాణ సీఎంగా అనగానే సభా ప్రాంగణం మొత్తం దద్దరిల్లిపోయింది. ఇది చూసి సోనియా, రాహుల్, ప్రియాంక ఒకింత ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. ఇదే రేంజ్‌లో సీత‌క్కకి కూడా ఆద‌ర‌ణ ద‌క్కింది. ఆమె ప్ర‌మాణ స్వీకారం చేసే స‌మ‌యంలోను తెగ గోల చేశారు. ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన, భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడతానని..’ చెబుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్బీ స్టేడియంలో ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఈ కార్యక్రమం జరిగింది.

Revanth Reddy took an oath as cm of telangana
Revanth Reddy

ఈ రోజుప్ర‌మాణ స్వీకారం కార్యక్ర‌మంలో రేవంత్‌తో పాటు మరో 11 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఎల్బీ స్టేడియం వేదికయ్యింది. మొత్తం మూడు వేదికల ఏర్పాటు చేయగా.. ప్రధాన వేదికపై ప్రమాణ స్వీకార కార్యక్రమం, ఎడమవైపున 63 సీట్లతో ఎమ్మెల్యేల కోసం ప్రత్యేక వేదిక, కుడిపక్కన వీవీఐపీల కోసం 150 సీట్లతో మరో వేదిక ఏర్పాటు చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా 500 మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సీనియర్‌ నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక వాద్రా, హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి సుక్విందర్‌ సుఖు, తాజా మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Tags: Revanth Reddy
Previous Post

Sonia Gandhi : రేవంత్ రెడ్డి మ‌న‌వ‌డితో ఆట‌లాడుకున్న సోనియా గాంధీ.. ఆశీస్సులు అందించిన రాహుల్..

Next Post

KTR : తెలంగాణ కొత్త ముఖ్య‌మంత్రికి కేటీఆర్ వార్నింగ్.. ప‌థ‌కాలు అమ‌లు చేయ‌క‌పోతే చెప్తాం..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

బిజినెస్

Torn Currency Notes : మీ ద‌గ్గ‌ర చిరిగిన లేదా మురికి ప‌ట్టిన క‌రెన్సీ నోట్లు ఉన్నాయా.. ఇలా మార్చుకోండి..!

by Shreyan Ch
May 16, 2024

...

Read moreDetails
టెక్నాల‌జీ

GPay PhonePe: గూగుల్ పే, ఫోన్ పేలో పొర‌పాటున ఇత‌రుల‌కు డ‌బ్బు పంపారా.. అయితే ఇలా చేయండి..!

by Usha Rani
November 20, 2022

...

Read moreDetails
special interest

Sleep : నిద్ర‌లో ఉన్న‌ప్పుడు ఛాతి మీద ఏదో ఉన్న‌ట్లు అనిపించిందా ? అయితే అది ఇదే..!

by editor
September 19, 2022

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.