Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన చిత్రాలు.. ఏవి హిట్ అయ్యాయో తెలుసా..?

Mounika Yandrapu by Mounika Yandrapu
November 8, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

ఆ పేరు ఒక ప్రభంజనం. ఆ పేరు ఒక సంచలనం. ఆ మూడు అక్షరాల పేరు చెబితే తెలుగు ప్రజల హృదయాలు ఉప్పొంగుతాయి. ఏ ప్రాంతంలోనే, ఏ దేశంలో ఉన్న తెలుగు వారైనా సరే ఆయన మావాడు అని సగర్వంగా చెప్పుకుంటారు. తెలుగు ప్రజల ముద్దుగా ఆయనని అన్నగారు అని ముద్దుగా పిలుచుకుంటారు. ఆయనే నటసార్వభౌమ ఎన్టీఆర్. మే 28 1923లో పుట్టిన ఎన్టీఆర్ నటన మీద ఆసక్తితో 1949వ సంవత్సరంలో మనదేశం అనే చిత్రం ద్వారా వెండి తెరపైకి అడుగు పెట్టారు.

ఇక్కడి నుంచి మొదలైన ఆయన సినీ ప్రస్థానం అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి ప్రేక్షకులను  మెప్పించారు. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు ప్రజల హృదయాలలో శాశ్వతంగా ఆరాధ్య దైవంగా నిలచిపోయాడు. సినిమా అంటేనే ఎన్టీఆర్.. ఎన్టీఆర్ అంటేనే సినిమా అనే విధంగా అన్నగారు ఒక సెపరేట్ ట్రెండ్ ని సెట్ చేశారు. సినిమా పరిశ్రమ సైతం ఆయన పుట్టినరోజునే ఒక వేడుకగా జరుపుకునే రోజులు కూడా ఉన్నాయి. మరీ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎన్నో చిత్రాలను రిలీజ్ చేసిన సందర్భాలు కూడా అప్పటిలో జరిగాయి. మరి అలా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

do you know which of the movies released on sr ntr birthdays

ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా తొలిసారిగా విడుదలైన చిత్రం విచిత్ర కుటుంబం. 1969 మే 28న ఈ చిత్రం విడుదలయ్యింది.  ఎన్టీఆర్‌, కృష్ణ‌, హీరోలుగా న‌టించిన ఈ చిత్రంలో శోభ‌న్ బాబు అతిధిపాత్రలో కనిపించారు . వీరు ముగ్గురు క‌లిసి న‌టించిన ఏకైక చిత్రం విచిత్ర కుటుంబం చిత్రం ఒకటే. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ గా రూపొందిన ఈ చిత్రానికి కె.ఎస్. ప్ర‌కాశ్ రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్, కృష్ణ అన్న‌ద‌మ్ములుగా న‌టించారు. విచిత్ర కుటుంబం చిత్రం అప్పట్లో ఘనవిజయాన్ని సాధించింది.

ఇక ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా విడుద‌లైన రెండ‌వ చిత్రం సంసారం. 1975 లో సంసారం చిత్రం విడుదలయ్యింది. ఆ ఒక సంవత్సరంలోనే ఎన్టీఆర్ ఎనిమిది చిత్రాల్లో న‌టించారు. వాటిలో ఐదు  ఈస్టమన్ కలర్ చిత్రాలు కావడం విశేషం. ఇక న‌ట సామ్రాట్ అక్కినేని నాగేశ్వ‌ర‌రావు తో క‌లిసి ఎన్టీఆర్ నటించిన సినిమా స‌త్యం, శివం. కె.రాఘ‌వేంద‌ర్‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ఎన్టీఆర్‌, ఏఎన్నార్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చివ‌రి సినిమా కావ‌డం గ‌మ‌నార్హం. 1981 మే 28న భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన స‌త్యం శివం  తొలివారం 51 ల‌క్ష‌లు వ‌సూలు చేసి క‌మ‌ర్షియ‌ల్‌గా ఓకే అనిపించుకుంది. 1982 మే 28 ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన మరో చిత్రం జస్టిస్ చౌదరి. ఈ చిత్రానికి కూడా కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం కూడా ఘన విజయాన్ని అందుకుంది. ఎన్టీఆర్‌, రాధ న‌టించిన ఏకైక చిత్రం చండ శాస‌నుడు. ఈ చిత్రం కూడా  1983 మే 28వ తేదీన భారీ ఓపెనింగ్స్‌తో విడుద‌ల అయింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఘనవిజయాన్ని సాధించింది.

Tags: sr ntr
Previous Post

సుధీర్- ర‌ష్మీ మ‌ధ్య ఏముంది.. సీక్రెట్ బ‌య‌ట‌కు చెప్ప‌నంటూ మ‌రింత ఆసక్తిని పెంచిన ర‌ష్మీ..

Next Post

అల వైకుంఠ‌పుర‌ములో మూవీలో చూపించిన ఇల్లు ఖ‌రీదు ఎంతో తెలుసా..?

Mounika Yandrapu

Mounika Yandrapu

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Abhinaya Great Words On Vishal : మూగ సైగ‌ల‌తో విశాల్‌ని ఇంప్రెస్ చేసిన అభిన‌య‌.. అలా చూస్తుండిపోయారు..!

by Shreyan Ch
September 13, 2023

...

Read moreDetails
వార్త‌లు

Kannada Prabhakar : సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ క‌న్న‌డ ప్ర‌భాక‌ర్ విల‌నే.. స్వ‌యంగా చెప్పిన భార్య‌..

by Shreyan Ch
March 28, 2023

...

Read moreDetails
వార్త‌లు

Upasana : ఉపాస‌న‌ని స‌ర్‌ప్రైజ్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..!

by Shreyan Ch
June 5, 2023

...

Read moreDetails
వార్త‌లు

Ginna Movie : జిన్నా మూవీకి దారుణ ప‌రాభ‌వం.. విష్ణు సినిమాలు మానేస్తే మంచిదంటున్న ప్రేక్ష‌కులు..

by Shreyan Ch
October 25, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.