Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home ఆహారం

ఆలయాల్లో అందించే ప్రసాదంలా పులిహోర రావాలంటే.. ఇలా తయారు చేయాలి..!

editor by editor
July 16, 2022
in ఆహారం, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

తెలుగు వారికి పులిహోర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీన్ని ఆలయాల్లో ఎక్కువగా ప్రసాదంగా అందిస్తుంటారు. అలాగే శుభ కార్యాలు జరిగినప్పుడు కూడా దీన్ని భోజనంలో వడ్డిస్తుంటారు. అయితే ఎంత ప్రయత్నించినా కొందరికి మాత్రం పులిహోరను ఆలయాల్లో మాదిరిగా తయారు చేయడం రాదు. కానీ కింద తెలిపిన విధానాన్ని తూ.చా. తప్పకుండా పాటిస్తే దాంతో పులిహోర ఎంతో రుచిగా తయారవుతుంది. ఇలా తయారైన పులిహోరను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇక ఆలయాల్లో ఉండే విధంగా పులిహోరను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పులిహోర తయారీకి కావల్సిన పదార్థాలు..

అన్నం – పావు కిలో, చింతపండు – 50 గ్రాములు, పసుపు – ఒక టీస్పూన్‌, ఉప్పు – రుచికి సరిపడా, కరివేపాకు రెబ్బలు – రెండు, చీల్చిన పచ్చి మిర్చి – మూడు, ఆవాలు – రెండు టేబుల్‌ స్పూన్లు, అల్లం – చిన్నముక్క, ఎండు మిర్చి – రెండు, బెల్లం పొడి – ఒక టీస్పూన్‌.

రెండో తాళింపు కోసం..

వేరుశెనగపప్పు – పావు కప్పు, మినప పప్పు, శెనగపప్పు – ఒక టేబుల్‌ స్పూన్‌ చొప్పున, ఎండు మిర్చి – 5, కరివేపాకు – రెండు రెబ్బలు, ఇంగువ, బెల్లం పొడి – చిటికెడు.

make pulihora in this way just like served in temples

పులిహోరను తయారు చేసే విధానం..

అన్నాన్ని కాస్త పలుగ్గా వండుకోవాలి. చింతపండును వేడి నీళ్లలో వేసి నానబెట్టాలి. అన్నం వేడిగా ఉన్నప్పుడే దాని మీద పసుపు, ఉప్పు వేసుకోవాలి. దీంట్లోనే కరివేపాకు, పచ్చి మిర్చి వేయాలి. కొంచెం వేరుశెనగ నూనె లేదా నువ్వుల నూనె పోసి అన్నానికి పట్టేలా పైపైన కలపాలి. ఇప్పుడు ఆవాలు, అల్లం, ఎండు మిర్చిని మిక్సీ జార్‌లో వేసి కొద్దిగా ఉప్పు వేసి మెత్తని పేస్టులా చేయాలి. దీంట్లో ఉప్పు వేయడం వల్ల వగరు రాకుండా ఉంటుంది.

స్టవ్‌ మీద కడాయి పెట్టి నూనె పోసి వేడి చేసి ఆవాలు, కొంచెం కరివేపాకు వేసి వేయించాలి. దీంట్లో చింతపండు పులుసు పోసి అది గుజ్జుగా అయ్యేంత వరకు మరిగించాలి. దీంట్లోనే కొద్దిగా బెల్లం పొడిని వేస్తే పులిహోర మరీ పుల్లగా ఉండదు. పులుసు దగ్గరగా అయిన తరువాత దీంట్లో ఆవాల పేస్టు వేసి ఉడికించాలి. తరువాత చల్లారిన అన్నాన్ని దీంట్లో వేసి మళ్లీ రెండో తాళింపు వేయాలి. దీని వల్లే పులిహోరకు అదనపు రుచి వస్తుంది.

కడాయిలో నూనె పోసి వేడి చేసి ఆవాలు వేసి అవి చిటపటలాడాక వేరుశెనగపప్పు, మినప పప్పు, శనగపప్పు వేయాలి. దీంట్లోనే ఎండు మిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించాలి. బాగా వేగిన తరువాత ముందు సిద్ధం చేసిన అన్నంలో వీటిని వేసి కలిపి రెండోసారి తాళింపులా వేయాలి. ఇలా చేస్తే పులిహోరకు బాగా రుచి వస్తుంది. ఇది అచ్చం ఆలయాల్లో అందించే ప్రసాదంలా ఉంటుంది. దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: pulihora
Previous Post

చేపలు ఎక్కువగా తింటే.. వ్యాధులతో మరణించే అవకాశాలు తక్కువే..!

Next Post

లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే.. సిరి సంపదలు కలుగుతాయి..!

editor

editor

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Sai Dharam Tej : ప‌ట్ట‌రాని ఆనందంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని ఎత్తేసిన సాయిధ‌ర‌మ్ తేజ్.. వీడియో వైర‌ల్..

by Shreyan Ch
June 5, 2024

...

Read moreDetails
వార్త‌లు

Ginna Movie : జిన్నా మూవీకి దారుణ ప‌రాభ‌వం.. విష్ణు సినిమాలు మానేస్తే మంచిదంటున్న ప్రేక్ష‌కులు..

by Shreyan Ch
October 25, 2022

...

Read moreDetails
politics

Pawan Kalyan In Warangal : వ‌రంగ‌ల్‌లో ప‌వన్ క‌ళ్యాణ్ క్రేజ్ చూసి ఒక్కొక్క‌డికి వ‌ణికిపోతుందిగా..!

by Shreyan Ch
November 24, 2023

...

Read moreDetails
వార్త‌లు

Master Bharat : కామెడీతో క‌డుపుబ్బా న‌వ్వించిన ఇత‌ని జీవితంలో ఇంత‌టి విషాదం ఉందా?

by Shreyan Ch
October 15, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.