Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Mutyala Muggu Movie : మూవీలో స్టార్స్ ఎవరూ లేరు.. రూ.12 లక్షలు పెట్టి తీశారు.. ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే..?

Usha Rani by Usha Rani
November 21, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Mutyala Muggu Movie : దర్శకుడు బాపు.. తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని, ఆ కళాఖండంలో తాము కూడా ఒక భాగం కావాలని నటీనటులంతా అనుకుంటారు. ఆయన తీసిన అద్భుతమైన కళాత్మక చిత్రాలు చూసి జనాలు అప్పట్లో ఆశ్చర్యపోయేవారు. మూవీలో సహజత్వం ఉట్టిపడేలా బాపు జాగ్రత్తలు తీసుకుంటారు. ఆయన అప్పట్లో వర్తమాన నటీనటులతో తీసిన గొప్ప చిత్రం ముత్యాల ముగ్గు. ఇందులో స్టార్స్ ఎవరూ లేరు. సుమారుగా ఈ చిత్రం తీయడానికి మేకర్స్ కు రూ.12 లక్షలు ఖర్చు అయిందట.

ఇక ఈ సినిమా అప్పట్లోనే రూ.2 కోట్ల‌కు పైగా వ‌సూళ్లతో రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో శ్రీధర్ హీరోగా న‌టించ‌గా సంగీత హీరోయిన్ గా న‌టించారు. అంతే కాకుండా అప్ప‌టికి పెద్ద‌గా గుర్తింపు లేని రావుగోపాల్ రావును విల‌న్ గా తీసుకున్నారు. ఈ సినిమాలో న‌టీన‌టుల‌కు మేక‌ప్ లేకుండానే తెర‌కెక్కించ‌డం అప్ప‌ట్లో హాట్ టాపిక్ గా మారింది. అంతే కాకుండా న‌టీన‌టుల‌కు మేక‌ప్ లేద‌ని తెలియ‌డంతో సినిమాను కొనేందుకు కూడా ఎవ‌రూ ముందుకు రాలేదు. ఈ సినిమా పూర్త‌యి మొద‌టి కాపీ రాగేనే ఎన్టీరామారావుకు చూపించారు.

Mutyala Muggu Movie know how much it collected
Mutyala Muggu Movie

సినిమా చూసిన ఎన్టీఆర్ మా రోజులు గుర్తుచేశావ్ బ్రద‌ర్ అంటూ బాపూను అభినందించార‌ట‌. అయిన‌ప్ప‌టికీ సినిమాపై అంచ‌నాలు లేక‌పోవ‌డంతో త‌క్కువ థియేట‌ర్ ల‌లో విడుద‌ల చేశారు. అవి కూడా పాత థియేట‌ర్ ల‌లోనే సినిమాను వేసుకున్నారు. మ‌హా అయితే ఈ సినిమా 4 రోజులు ఆడుతుందేమో అనే భావ‌న‌లో చిత్ర యూనిట్ ఉందట. సినిమాకు ప‌బ్లిసిటీ కూడా చేయ‌లేదు. కానీ ఈ సినిమాకు వ‌స్తున్న టాక్ చూసి ఆశ్చ‌ర్య‌పోయారు. ఫస్ట్ వీక్ నుండి క‌లెక్ష‌న్ ల జోరు పెరిగింది. ప్రేక్ష‌కుల‌కు తెగ న‌చ్చ‌డంతో కోట్ల‌ల్లో వ‌సూలు చేసింది.

Tags: Mutyala Muggu MovieTollywood
Previous Post

Ankusham Fight Scene : అంకుశం రామిరెడ్డిని రాజ‌శేఖ‌ర్ నిజంగానే రోడ్డుపై బ‌ట్ట‌లూడ‌దీసి కొట్టాడ‌ట‌.. అప్పుడు ఏమైందంటే..?

Next Post

Blood Circulation : వీటిని తింటే ర‌క్తం పెర‌గ‌డ‌మే కాదు.. ర‌క్త స‌ర‌ఫ‌రా కూడా మెరుగు ప‌డుతుంది..

Usha Rani

Usha Rani

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

special interest

Keys Tag : తాళం చెవుల‌కు ఉండే ట్యాగ్‌పై నంబ‌ర్ ఉంటుంది క‌దా.. అదేమిటో తెలుసా..?

by editor
October 5, 2022

...

Read moreDetails
వార్త‌లు

Yashoda Movie : యశోద సీక్వెల్‌కి కూడా స‌మంత రెడీ.. ఖాకీ దుస్తుల్లో అద‌ర‌గొట్ట‌నున్న సామ్..

by Shreyan Ch
November 17, 2022

...

Read moreDetails
టెక్నాల‌జీ

4జి వీవోఎల్‌టీఈ ఫోన్‌ను లాంచ్ చేసిన నోకియా.. ధ‌ర ఎంతో తెలుసా ?

by editor
August 3, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

రోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను త‌ప్ప‌క తాగాలి.. అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు..!

by editor
July 26, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.